Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కెమెరామన్ గంగ.. తమన్నా - రాంబాబు... పవన్ కల్యాణ్ - ఛానల్ ఖర్చు రూ.3 కోట్లు

కెమెరామన్ గంగ.. తమన్నా - రాంబాబు... పవన్ కల్యాణ్ - ఛానల్ ఖర్చు రూ.3 కోట్లు
, బుధవారం, 20 జూన్ 2012 (20:42 IST)
WD
ఇండస్ట్రీలో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ కిక్కు రోజురోజుకీ ఎక్కుతోంది. ఆయనంటే మెగా అభిమానులు వెర్రెక్కిపోతున్నారు. పవన్ నటించిన సినిమాలు వెరైటీగా ఉండటంతోపాటు అభిమానులకు ఎటువంటి మసాలా కావాలో చూసుకుని మరీ నటిస్తున్నాడు పవన్.

ఆ సంగతి అలా ఉంటే... తాజాగా పవన్ కల్యాణ్ - మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తున్న కెమెరామన్ గంగతో రాంబాబు చిత్రం కోసం దర్శకుడు పూరీ జగన్నాథ్ భారీ సెట్ రూపొందించారట. ఈ సెట్ కోసం ఏకంగా రూ. 3 కోట్లు ఖర్చు చేసినట్లు టాలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు.

ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ నటన అదుర్స్‌గా ఉంటుందనీ, ఇక పాలపిల్ల గ్లామర్ కెవ్వుకేక అని అంటున్నారు. మొత్తమ్మీద పవర్ స్టార్ అండ్ పాలపిల్లకు కెమెరామన్ గంగతో రాంబాబు మెగా హిట్ ఇస్తుందన్నమాట. చూద్దాం... పూరీ ఏం చేస్తారో...?!!

Share this Story:

Follow Webdunia telugu