Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరీనా చొట్ట బుగ్గలను వదల్లేని సైఫ్ అలీ ఖాన్

Advertiesment
బాలీవుడ్ తారలు
సినీ తారలు తమ అందాలకు మెరుగులు దిద్దుకునే వ్యవహారంలో మునుముందుకు వెళుతున్నారు. మొన్నటి వరకూ నడుము చుట్టు కొవ్వు కరిగించుకోవడం, వక్షోజాలను పెద్దవిగా చేసుకోవడంకోసం బ్రెస్ట్ ఇంప్లాంటేషన్ వంటివాటికే పరిమితమైన తారలు తాజాగా బుగ్గలపై దృష్టి కేంద్రీకరించారు. కొవ్వెక్కిన బుగ్గలు మాకొద్దంటూ బుగ్గల్లోనున్న కొవ్వును తీయించుకుంటున్నారు. బుగ్గల్లో కొవ్వును తీయడమేంటి... అనుకుంటున్నారా...? ఇది నిజం. 

బాలీవుడ్‌లో ఉన్న హీరోయిన్లలో బూరె బుగ్గలు కలిగిన తారామణులు చాలామంది ఈ బుగ్గలు తగ్గించుకునే చికిత్సను చేయించుకుంటున్నారట. ముంబయిలో ఈ చికిత్సలను చేస్తున్న వైద్యులకు ఇప్పుడు తీరిక దొరకడం లేదట. గతంలో వక్షోజపు అందాలకోసం, నడుము నాజూకుదనంకోసం ఎగబడిన తారలు ఇప్పుడు బుగ్గల నాజూకుదనంకోసం తమ వద్దకు క్యూ కడుతున్నారని సదరు వైద్యులు చెపుతున్నారు.

ఈ చికిత్సకోసం నోట్లో ఉన్న దవడలకు చిన్న రంధ్రం చేసి, బుగ్గల లోపల అధికంగా ఉన్నటువంటి కొవ్వును తీసి వేస్తారు. ఇందుకుగాను 35 వేల రూపాయల నుంచి 40వేల వరకూ ఖర్చవుతుందట. అయినప్పటికీ అందాల భామలు బూరెల్లాంటి బుగ్గలను అప్పడాల్లా ఫ్లాట్‌గా చేసుకుంటున్నారట.

కొవ్వులేని బుగ్గలనే అభిమానులు ఎంతో ఇష్టంగా చూస్తున్నారని సదరు భామలు వాదిస్తున్నారు. దీనికితోడు తమ బాయ్ ఫ్రెండ్స్ కూడా అప్పడాల్లాంటి చట్టు బుగ్గలనే తెగ ఇష్టపడుతున్నారట. అన్నట్లు కరీనాకపూర్ ఈమధ్యనే చికిత్స చేయించుకుని బుగ్గలను తగ్గించుకున్నదట. అప్పటి నుంచి సైఫ్ అలీ ఖాన్ కరీనాను వదల్లేక పోతున్నాడట. ఈ విషయం తెలుసుకున్న మిగిలిన తారలు తమ బుగ్గలను కూడా తగ్గించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట.

కానీ టాలీవుడ్ హీరోయిన్లు మాత్రం... అప్పడాల్లా నోటికి అతుక్కుపోయిన బుగ్గలతో అందమా...? అని ఎగతాళిగా నవ్వుకుంటున్నారట. బాలీవుడ్ భామలు మాత్రం.. గతంలో తాము తొలిసారిగా బికినీలు వేసినప్పుడు కూడా మిగిలిన పరిశ్రమలకు చెందిన తారలు ఇలాగే అన్నారనీ, క్రమంగా వారు కూడా తమ బాటలోనే పయనిస్తారని చెపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu