తనకు ఫిక్షన్, సస్పెన్స్ తరహా కథలంటే చాలా ఇష్టమని గోవా భామ ఇలియానా చెబుతోంది. షూటింగ్ గ్యాప్‌లో హీరోయిన్లు ఫోన్లలోనూ, బాతాఖానీతో కాలక్షేపం చేస్తుంటారు. తాను మాత్రం చక్కగా పుస్తకాలు చదువుతానని చెబుతోంది. ముఖ్యంగా ఫిక్షన్, సస్పెన్స్ తరహా పుస్తకాలంటే చెవికోసుకుంటాననంటోంది.
సినిమాల్లోకూడా వాటినే ఆసక్తిగా చూస్తానని అంటోంది. మరి రామ్‌గోపాల్ వర్మ చిత్రాల్లో నటిస్తే పోయేదికగదా.. అంటే.. ఆయన దృష్టి ఎందుకో తనపై పడలేదని అంటోంది. అయినా.. ఆయన చిత్రాల్లో ఎక్స్‌పోజింగ్ ఎక్కువగా ఉంటుందనీ, ప్రస్తుతం అంత ఎక్స్‌పోజింగ్ చేయలేనని స్పష్టంచేస్తోంది.
వైవిఎస్ చౌదరి తొలి చిత్రం దేవదాసులో అనుకోకుండా పాత్ర అలా కుదిరిందని సమర్థించుకుంటుంది. ఏదిఏమైనా వృత్తిపరంగా ఎన్ని సమస్యలు వచ్చినా మంచి పుస్తకం ఉపయోగపడుతుందని సెలవిస్తోంది.