Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంత పని చేశావన్నా...? నానిపై ఎన్టీఆర్ గరం గరం..?!!

Webdunia
WD
కొడాలి నాని- జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరూ స్వయానా అన్నదమ్ములు కాకపోయినప్పటికీ... అన్నదమ్ముల్లా కలసిమెలసి ఉంటారు. అటువంటిది తెలంగాణా ఉద్యమం వాళ్లిద్దర్నీ తలోదిక్కున విడదీసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సమైక్యాంధ్ర ధ్యేయంగా విద్యార్థులు చేస్తున్న పాదయాత్రను ప్రభుత్వం అడ్డుకోవడమే కాక వారిని అరెస్టు చేయడాన్ని కొడాలి నాని తీవ్రంగా ఖండించారు. తెరాస నాయకులపై నిప్పులు చెరిగారు.

అదుర్స్ సినిమాను అడ్డుకుంటామని సవాల్ విసిరినవారు ఎంతవరకు సఫలమయ్యారని విమర్శించారు. హైదరాబాదు గురించి మాట్లాడితే నాలుకలు కోస్తామన్న కేసీఆర్.. ఎంతమంది నాలుకలు కోశారని ప్రశ్నించారు...?

నాని వ్యాఖ్యలపై తెరాస మండిపడింది. జూనియర్ ఎన్టీఆర్ పదే పదే బతిమాలితే అదుర్స్ చిత్ర ప్రదర్శనను అడ్డుకోలేదనీ తెలిపింది. తాజాగా నాని అహంకారపూరిత వ్యాఖ్యలు ఉపసంహరించుకునేంత వరకూ తెలంగాణాలో జూనియర్ ఎన్టీఆర్ అదుర్స్ చిత్ర ప్రదర్శనను పూర్తిగా అడ్డుకోవాలని టీజేఏసి కన్వీనర్ కోదండరామ్ పిలుపునివ్వడంతో పరిస్థితి మారిపోయింది. ఆందోళనకారులు ఎన్టీఆర్ వాల్‌పోస్టర్లను చించివేయడమే కాక, ఎన్టీఆర్ స్టిల్స్‌పై చెప్పులతో కొట్టడం వంటి చర్యలకు పాల్పడ్డారు.

వీటన్నిటినీ చూసిన జూనియర్ ఎన్టీఆర్ "అన్న" నానిపై గుర్రుగా ఉన్నట్లు సమాచారం. అదుర్స్ గురించి మాట్లాడకుండా ఉండాల్సిందని ఏభిప్రాయపడినట్లు భోగట్టా. అయితే నాని మాత్రం సమైక్యాంధ్ర విద్యార్థులకు జరిగిన అవమానాన్ని తాను చూస్తు చేతులు ముడుచుకుని కూచోలేనని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. మరోవైపు కొడాలి నాని వ్యాఖ్యలపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించాలని తెలంగాణా వాదులు పట్టుబడుతున్నారు. మరి జూనియర్ ఎన్టీఆర్ ఏం చెపుతాడో వేచి చూడాలి!!
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో లిక్కర్ స్కామ్ : వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్

సహోద్యోగినికి ముద్దు పెట్టి ఉద్యోగానికి రాజీనామా చేసిన సీఈవో

డ్రగ్స్ ప్రిస్కిప్షన్ కోసం శృంగారాన్ని డిమాండ్ చేసిన భారత సంతతి వైద్యుడు..

హనీమూన్ ఖర్చు కోసం పెళ్ళి విందులో మొదటి ప్లేట్ భోజనాన్ని వేలం వేసిన కొత్త జంట... (వీడియో)

మెగా డ్యామ్ నిర్మాణాన్ని ప్రారంభించిన డ్రాగన్ కంట్రీ.. భారత్ ఆందోళన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

Show comments