Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎంత చూపించినా అదృష్టం లేకపోతే అంతే: స్నేహ

ఎంత చూపించినా అదృష్టం లేకపోతే అంతే: స్నేహ
, శనివారం, 5 ఫిబ్రవరి 2011 (13:27 IST)
"శ్రీరామదాసు"లో నటించిన స్నేహకు మళ్ళీ అటువంటి పాత్రలు లభించలేదు. కానీ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు తను ఎలాంటి రూల్స్‌ పెట్టుకున్నదో అలాంటివే ఇప్పటికీ కంటెన్యూ చేస్తున్నట్లు చెప్పింది. మంచి పాత్ర లభిస్తే ఎటువంటి సినిమాలైనా చేస్తానని మరీ చెబుతుంది. 

ఆ మధ్య ఎక్స్‌పోజింగ్‌కు సిద్ధమేనని కొన్ని చిత్రాల్లో చేసినా ఫలించలేదు. అందుకే ఆమెకు ఓ విషయం అర్థమయిందట. ఇండస్ట్రీలో అదృష్టం కీలక పాత్ర వహిస్తుందన్నదే తను నమ్మిన సిద్ధాంతం అంటోంది.

ప్రతిభ ఉన్నా అది కలిసిరాకపోతే ఓడిపోతామని తెలుసుకున్నానని అంటోంది పూర్ స్నేహ. తాజాగా తమిళ, తెలుగులో రాబోతున్న చిత్రంలో నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఈ చిత్రంలో పోలీసు అధికారిణిగా చేస్తుంది. పాపం చిత్రం విడుదల మాత్రం రోజులను నెట్టుకుంటూ వెళుతూ బాగా ఆలస్యం అవుతోంది.

Share this Story:

Follow Webdunia telugu