రెండేళ్లపాటు ఏ సినిమాను ఒప్పుకోక కేవలం "యుగానికి ఒక్కడు" అనే తమిళ చిత్రంలో నటించిన రీమాసేన్... కథలు నచ్చకే ఎన్ని అవకాశాలు వచ్చినా రిజెక్ట్ చేశానని చెపుతోంది. అయితే ఆ చిత్రంలో ఎక్స్‌పోజింగ్ పరిమితి మించిపోయిందన్న విమర్శలను కొట్టి పారేస్తూ గ్లామర్‌గా కనిపించానని అంటోంది.
పెళ్లెప్పుడు అని అడిగితే... ఈ ఏడాది నా డైరీలో ఆ పదానికి చోటు లేదని నిర్మొహమాటంగా వెల్లడించింది. కొన్ని విషయాలు మనం వద్దనుకున్నా జరిగిపోతాయనీ, అలాగే పెళ్లి కూడా జరిగిపోతుందని వేదాంతం మాట్లాడుతోంది.
అసలు విషయం ఏమిటంటే... చూస్తే ప్రేమించేయాలి అనేంతగా తనకెవరూ తారస పడలేదట. పెళ్లి విషయంలోనూ ఇదే మాట అంటోంది. మరి సినిమాలో అంటే... అది దర్శకుడు చెబితే అర్జెంటుగా ప్రేమించేయాలి.. తప్పదు అంటూ ముసిముసి నవ్వులు వలకపోస్తోంది.