Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అనుష్క లవ్ ఎఫైర్ విత్ ఆర్య... హైదరాబాదులో రొమాన్స్!

అనుష్క లవ్ ఎఫైర్ విత్ ఆర్య... హైదరాబాదులో రొమాన్స్!
, బుధవారం, 31 జులై 2013 (17:39 IST)
FILE
అందాల భామ అనుష్క ఎప్పుడూ ఏదో ఒక వార్తతో మీడియాలో హల్‌చల్ చేస్తుంది. ఆమె సినీఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా లవ్ ఎఫైర్స్ చిట్టా బోలెడంత ఉంది. గతంలో ఆమె ఎఫైర్ల జాబితాలో చాలా మంది హీరోలు చేరారు. ఇప్పుడు కొత్తగా ఆ జాబితాలో తమిళ నటుడు ఆర్య చేరాడు.

ఇటీవల వీరిద్దరూ కలిసి 'ఇరాండం ఉలగమ్' (తెలుగులో వర్ణ) చిత్రంలో నటించినప్పటి నుంచీ వీరి మధ్య స్నేహం పెరిగిందని అంటున్నారు. ఇటీవల ఆ స్నేహం ప్రేమగా మారిందని కోలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. అనుష్క నటించిన 'సింగం 2' సినిమా విజయం సాధించిన నేపథ్యంలో తాజాగా నిర్మాత ఏర్పాటు చేసిన పార్టీకి ఆర్యాను వెంటబెట్టుకుని వెళ్లిందట అనుష్క. అలాగే, ఇద్దరూ కలిసి హైదరాబాదులో కూడా జంటగా విహరిస్తూ డ్యూయట్ సాంగులు పాడుకుంటున్నారట. మరి, ఈ స్నేహం ఎటువైపు పయనిస్తుందో!

Share this Story:

Follow Webdunia telugu