Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

"సింహా"గా వస్తోన్న నందమూరి బాలకృష్ణ

Advertiesment
సింహా
WD
నరసింహనాయుడు, లక్ష్మీనరసింహ వంటి చిత్రాల్లో నటించిన నందమూరి బాలకృష్ణ "సింహా"గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

యునైటెడ్ మూవీస్ పతాకంపై పరుచూరి కిరీటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. గురువారం నాడు హైదరాబాదులో ఈ సినిమా షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది.

ఈ సినిమా ప్రారంభోత్సవానికి ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్, తారకరత్న, మోహనకృష్ణలతో పాటు తదితర నందమూరి వంశీయులు హాజరయ్యారు. బాలకృష్ణపై తీసిన ముహూర్తపు షాట్‌కు డి. సురేష్‌బాబు క్లాప్ కొట్టగా, ప్రముఖ నిర్మాత దిల్‌రాజు కెమెరా స్విచ్ఛాన్ చేశారు.

ఈ సందర్భంగా "నేను మాట్లాడేటప్పుడు ఈ చెవులు మాత్రమే పనిచేయాలి. కాదని వేరేది పనిచేసిందో నీ నెక్ట్స్ బర్త్‌డే ఉండదు" అని బాలయ్య మాట్లాడిన డైలాగ్‌‌ అందరిని క్లాప్స్ కొట్టేలా చేసింది.

ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ.. బాలయ్యతో సినిమాలు చేయాలని అందరూ పోటీ పడతారని, అలాంటి అవకాశం తనకు లభించడం సంతోషంగా ఉందన్నారు. నందమూరి వంశీయులకు తగిన రేంజ్‌లో "సింహా" ఉంటుందని చెప్పారు.
webdunia
WD

కథ గురించి చెబుతూ.. సమాజంలో జరిగే ఓ సమస్యను హీరో అయిన "సింహా" ఎలా పరిష్కరించాడనే ఈ సినిమా ఇతివృత్తమని దర్శకుడు వెల్లడించారు. అయితే "సింహా" రాజకీయ, ఫ్యాక్షనిజం నేపథ్యంలో ఉండదని ఆయన స్పష్టం చేశారు.

నిర్మాత పరుచూరి కిరీటి మాట్లాడుతూ.. ఈ నెల 24 నుంచి రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభిస్తామని తెలిపారు. సింగిల్ షెడ్యూల్‌తో ఏకధాటిగా సాగే ఈ సినిమాను హైదరాబాద్, వైజాగ్ తదితర పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించనున్నట్లు నిర్మాత వెల్లడించారు.

సంగీత దర్శకుడు చక్రి మాట్లాడుతూ.. బాలయ్య సినిమా అంటేనే ఎనర్జీ ఉంటుందని, ఆయన రేంజ్, ఎనర్జీకి తగినట్లు సంగీతం సమకూర్చేందుకు సన్నాహాలు చేస్తున్నానని చెప్పారు. ఇందులో ఆరు పాటలున్నాయని, త్వరలో రీరికార్డింగ్ కార్యక్రమాలను ప్రారంభిస్తామని చక్రి అన్నారు.

ఇకపోతే.. నటీనటుల వివరాలను రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంలో తెలియజేస్తామని ఎగ్జిక్యూటివ్ నిర్మాత మహేంద్రబాబు చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu