Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

"శంభో శివ శంభో" అంటోన్న రవితేజ!

Advertiesment
శంభో శివ శంభో
WD
"కిక్" సినిమా తర్వాత క్రేజీ హీరో రవితేజ "శంభో శివ శంభో" అంటూ తెరపైకి రానున్నారు. శ్రీ సాయిగణేష్ ప్రొడక్షన్స్‌పై బెల్లంకొండ నిర్మిస్తున్న "శంభో శివ శంభో" చిత్రంలో రవితేజ హీరోగా నటిస్తున్నారు.

తమిళంలో అనంతపురం 1980 ఫేమ్ శశికుమార్ హీరోగా నటించిన "నాడోడిగళ్" అనే చిత్రానికి రీమేక్‌గా రూపుదిద్దుకోనున్న "శంభో శివ శంభో" చిత్రంలో రవితేజతో పాటు అల్లరి నరేష్, శివబాలాజీలు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

శ్రావణపూర్ణిమ సందర్భంగా హైదరాబాదులోని శ్రీ సాయిగణేష్ ప్రొడక్షన్స్ సంస్థ కార్యాలయంలో ఈ సినిమా షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది. దేవుని పటాలపై తీసిన తొలిషాట్‌కు "అరుంధతి" నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి క్లాప్ కొట్టగా, స్రవంతి రవికిషోర్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. వి.వి. వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు.

ఈ సందర్భంగా నిర్మాత బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ.. ఈ నెల 16 నుంచి "శంభో శివ శంభో" రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభిస్తామన్నారు. తదనంతరం రాజమండ్రి, హైదరాబాద్, వైజాగ్ తదితర ప్రాంతాల్లో జరిగే షూటింగ్‌తో ఈ చిత్రాన్ని పూర్తి చేస్తామని బెల్లంకొండ సురేష్ వెల్లడించారు.

ప్రేమ, స్నేహం నేపథ్యంలో సాగే ఈ సినిమా, తెలుగులో వచ్చిన గత చిత్రాలకంటే భిన్నంగా ఉంటుందని నిర్మాత తెలిపారు. ఇంకా ఈ చిత్రానికి తమిళం "నాడోడిగళ్" చిత్రానికి దర్శకత్వం వహించిన సముద్ర కనికే తెలుగు చిత్ర దర్శకత్వ పగ్గాలు అప్పగించినట్లు బెల్లంకొండ సురేష్ చెప్పారు. ఇదేవిధంగా.. తమిళ చిత్రానికి సంగీతం సమకూర్చిన సుందర్. సి తెలుగు చిత్రానికి కూడా సంగీతం అందిస్తారని నిర్మాత వివరాలందించారు.

ఇందులో ముగ్గురు స్నేహితులుగా రవితేజ, అల్లరి నరేష్, శివబాలాజీలు నటిస్తుండగా, మిగిలిన పాత్రలను సునీల్, ప్రియమణి, రోజా, కృష్ణభగవాన్ తదితరులు పోషిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu