Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇద్దరూ బిజీ బిజీ.. అయినా జతకట్టేందుకు రెడీ..

ఇద్దరూ బిజీ బిజీ.. అయినా జతకట్టేందుకు రెడీ..
, శుక్రవారం, 26 జూన్ 2015 (10:26 IST)
టాలీవుడ్‌లో క్రేజీ బ్యూటీగా వెలుగుతున్న చిన్న సమంత. వరుస అవకాశాలతో బిజీ బిజీగా ఉన్న ఈ బ్యూటీ మరో యంగ్ హీరో‌ సరసన చేరేందుకు సిద్ధమైంది. సమంత బిగ్ హీరోలు, యంగ్ హీరోలు అనే తేడా లేకుండా అందరితోనూ నటిస్తూ, వచ్చే ప్రతి ఛాన్స్‌లను ఒప్పేసుకుంటోంది. పండగ చేస్కో సినిమా తర్వాత రామ్ రెండు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. 
 
ఒకటి శివం, మరొకటి హరికథ. ప్రస్తుతం శివం సినిమాకి సంబంధించిన చిత్రీకరణ జోరుగా జరుగుతోంది. ఈ సినిమాలో రామ్ సరసన రాశిఖన్నా నటిస్తోంది. ఈ రెండు సినిమాల తర్వాత రామ్ అప్ కమింగ్ సినిమాలో హీరోయిన్‌గా నటించేందుకు సమంత అంగీకరించినట్లు టాలీవుడ్ టాక్. సమంత, రామ్ కాంబినేషన్‌లో ఎప్పుడో రావలసి ఉన్నది. 
 
అయితే ఇద్దరు బిజీ బిజీగా ఉండడంతో కొంత ఆలస్యం చోటు చేసుకుంది. పోనీ ఇప్పటికైనా కుదిరింది కదా అని అభిమానులు సంబరపడుతున్నారు. సమంత, రామ్ సరసన నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ విషయం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన అందాల్సి ఉంది.

Share this Story:

Follow Webdunia telugu