Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేను ఆ టైపు కాదు.. అటువంటి సీన్లలో నటించను: యామీ గౌతమ్!

నేను ఆ టైపు కాదు.. అటువంటి సీన్లలో నటించను: యామీ గౌతమ్!
, సోమవారం, 23 జూన్ 2014 (13:35 IST)
సినీరంగంలో అవకాశాలు కోసం కొందరు హీరోయిన్లు హాట్‌హాట్ ఎక్స్‌పోజింగ్, లిప్‌లాక్ సీన్లలో నటించేందుకు కూడా సై అంటోన్న ఈ రోజుల్లో అందాల భామ యామీ గౌతమ్ మాత్రం తాను ఇటువంటి వాటికి దూరమని అంటోంది. నువ్విలా, గౌరవం, యుద్ధం వంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది.

తాజాగా ఈ ముద్దుగుమ్మ తెలుగులో నితిన్ సరసన "కొరియర్‌బాయ్ కళ్యాణ్'' సినిమాలో నటించడానికి అంగీకరించింది. ఐతే తాను బికినీ వంటి దుస్తులు వేసుకునే ప్రసక్తే లేదని బల్లగుద్ది చెబుతోంది. మీరు ఎంత ఇచ్చినా బికినీ, లిప్‌లాక్స్ వంటిని చేయనని యామీ నిర్మాతలకు కరాఖండిగా చెబుతోంది. ఎంత పెద్ద హీరో అయినా, పెద్ద బ్యానరైనా నా పద్ధతి ఇంతే" అంటూ తేల్చి చెప్పేసింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తమిళంలో "అంజులుమ్" అనే సినిమాలో నటిస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu