Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విమలా రామన్‌ గ్లామర్‌ ఒలకబోస్తోంది....

విమలా రామన్‌ గ్లామర్‌ ఒలకబోస్తోంది....
, గురువారం, 20 నవంబరు 2014 (17:14 IST)
నటి విమలా రామన్‌ గుర్తుండే వుంటుంది. చాలాకాలం గ్యాప్‌ తర్వాత మళ్ళీ తెలుగులోకి రావాలనుకుంటుందట. గతంలో జగపతి బాబు, తరుణ్‌లతో జోడీగా నటించిన అలరించింది. ఓ చిత్రంలో తరుణ్‌తో బాత్‌రూమ్‌ సీన్‌లోనూ రక్తి కట్టించింది. అయినా ఆమెకు సరియైన విజయాలు లేకపోవడంతో కొంతకాలం దూరంగా వుంది. కొంతకాలం విదేశాలకు వెళ్ళిన ఆమె ఇప్పుడు మళ్ళీ నటించడానికి సిద్ధమవుతోంది. అయితే ఆమెకు ఐటంగాళ్‌గా నటించాలని ఇద్దరు నిర్మాతలు ఆఫర్ చేయగా అందుకు ముందుగా అంగీకరించలేదు. 
 
కానీ... అలా అయితేనే ఇండస్ట్రీకి మళ్ళీ ఛాన్స్‌లు వస్తాయనీ, ఒకేసారి హీరోయిన్‌ అయితే గత ప్రభావం పాత్రలపై వుంటుందని సన్నిహితులు తెలియజేయడంతో అంగీకరించినట్లు సమాచారం. తాజాగా మంచు విష్ణు నటించబోయే చిత్రంలో ఆమె నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి ఆటోనగర్‌ సూర్య దర్శకుడు దేవకట్టా దర్శకత్వం వహించనున్నట్లు తెలిసింది. డిసెంబర్‌లో ఈ చిత్రం సెట్‌ పైకి ఎక్కనుంది.

Share this Story:

Follow Webdunia telugu