Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రీదేవి మేడమ్‌ను దగ్గర్నుంచి చూసి ఆశ్చర్యపోయా!: హన్సిక

శ్రీదేవి మేడమ్‌ను దగ్గర్నుంచి చూసి ఆశ్చర్యపోయా!: హన్సిక
, గురువారం, 20 నవంబరు 2014 (11:19 IST)
అభిమాన నటులను, బాగా ఇష్టపడేవారిని ఒక్కసారిగా చూస్తే ఆశ్చర్యపోతాం. ఆ క్షణాలను నమ్మలేకపోతాం కూడా. బబ్లీ హన్సికకు కూడా ఇలాంటి అనుభూతే కలిగింది. అతిలోక సుందరి శ్రీదేవిని ప్రత్యక్షంగా చూసిన అందాల భామ హన్సిక తనను తాను నమ్మలేకపోయింది. 
 
తమిళంలో వారిద్దరూ కలసి నటిస్తున్న సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. అప్పుడే 'శ్రీ'ని చూసిన బబ్లీగాళ్ విస్మయం చెందిందట. "శ్రీదేవి మేడమ్‌ను దగ్గర్నుంచి చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపడ్డా. ఏం అద్భుతమైన వ్యక్తిత్వం అని కితాబిచ్చింది.
 
అంతేగాకుండా తనతో కలసి నటించబోతుండటం చాలా అదృష్టం. తన నుంచి చాలా నేర్చుకోవచ్చు... చాలా ఆహ్లాదకరమైన వ్యక్తి" అని ఎగ్జైట్ అవుతూ చెప్పింది హన్సిక. చింబుదేవన్ దర్శకత్వంలో హీరో విజయ్ నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీదేవి మహారాణి పాత్రలో చేస్తుండగా.. హీరోయిన్ లాంటి రోల్‌ను హన్సిక పోషిస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu