Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బేనజీర్ భుట్టో జీవిత కథలో విద్యా బాలన్..!

బేనజీర్ భుట్టో జీవిత కథలో విద్యా బాలన్..!
, మంగళవారం, 3 ఫిబ్రవరి 2015 (15:47 IST)
దక్షిణాది చిత్ర సీమలో టాప్ హీరోయిన్లుగా వెలుగుతున్న బ్యూటీలు పెళ్లయ్యాక హీరోయిన్లుగా రాణించడం అరుదు. అదే బాలీవుడ్‌లో అయితే పెళ్లయ్యాక కూడా హీరోయిన్ ఛాన్స్‌లు పొందేవారు ఎక్కువే. ఆ కోవలో నటి విద్యా బాలన్‌కు అనేక అవకాశాలు వస్తున్నాయి. 
 
అయినప్పటికీ తాను మాత్రం సెలెక్టివ్‌గానే పాత్రను ఎంపిక చేసుకుంటుంది. తాజాగా ఆమెకు రెండు బయోపిక్ (వాస్తవ జీవిత కథలు)లలో నటించే ఛాన్స్ వచ్చింది. వీటిలో ఒకటి ప్రముఖ బాలీవుడ్ నటి దివంగత సుచిత్రా సేన్ జీవితం ఆధారంగా రూపొందే చిత్రం కాగా, మరొకటి పాకిస్తాన్ మాజీ ప్రధాని దివంగత బేనజీర్ భుట్టో జీవిత చరిత్ర. 
 
కాగా వీటిలో విద్యా బాలన్ బేనజీర్ పాత్రను ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. ఎందుకంటే, ఈ పాత్ర చేయడం వల్ల ఆమెకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుందని విద్యా బాలన్ ధీమా వ్యక్తం చేస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu