Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గోవిందుడు అందరి వాడేలే టీజర్: వరుణ్ తేజ్ ట్వీట్స్ (ట్రైలర్)

గోవిందుడు అందరి వాడేలే టీజర్: వరుణ్ తేజ్ ట్వీట్స్ (ట్రైలర్)
, శుక్రవారం, 8 ఆగస్టు 2014 (18:02 IST)
రామ్ చరణ్ తేజ్ తాజా సినిమా 'గోవిందుడు అందరి వాడేలే' సినిమా టీజర్‌పై అతని తమ్ముడు స్పందించాడు. రామ్ చరణ్ తమ్ముడెవరనుకుంటున్నారా? కొణిదెల కుటుంబం నుంచి వెండితెరకు కొత్తగా పరిచయం అవుతున్న వరుణ్ తేజ్. 
 
వరుణ్ తేజ్ నాగబాబు తనయుడన్న విషయం తెలిసిందే. కాగా, చరణ్ అన్న 'గోవిందుడు అందరి వాడేలే'తో వస్తున్నాడు. టీజర్ అద్భుతంగా రంగుల హరివిల్లులా ఉంది. సినిమా ఎప్పుడు చూస్తానా అని ఆతృతతో ఎదురుచూస్తున్నా అని వరుణ్ తేజ్ ట్వీట్ చేశాడు.

కాగా హైదరాబాదు శివారు నానక్ రాంగూడలో రామ్ చరణ్ తేజ నటించిన ‘గోవిందుడు అందరి వాడేలే’ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదలైంది. కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు.
 
రామ్ చరణ్‌కు తాతగా ప్రకాశ్ రాజ్ నటించగా, శ్రీకాంత్ ఓ ప్రత్యేక పాత్ర పోషించారు. ఈ సినిమా టీజర్‌ను చిత్ర యూనిట్ గురువారం విడుదల చేసింది. ఈ చిత్రంలో శ్రీకాంత్ సరసన కమలిని ముఖర్జీ నటిస్తోంది. 
 
ఈ సందర్భంగా కమలిని మాట్లాడుతూ.. చాలా గ్యాప్ తర్వాత ఈ చిత్రంలో నటించేందుకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పింది. ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని ఆమెతో పాటు రామ్ చరణ్ తేజ, హీరోయిన్ కాజల్ అగర్వాల్, శ్రీకాంత్ ధీమా వ్యక్తం చేశారు.

 


Share this Story:

Follow Webdunia telugu