Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కుమ్ముతున్న మెగా హీరో... కొత్త ప్రాజక్టులకు రెడీ

కుమ్ముతున్న మెగా హీరో... కొత్త ప్రాజక్టులకు రెడీ
, సోమవారం, 22 డిశెంబరు 2014 (09:41 IST)
మెగా ఫ్యామిలీ నుంచి వెండితెరపైకి వస్తున్న మరో కొత్త హీరో వరుణ్ తేజ్. ఈ యంగ్ హీరో నటించిన 'ముకుంద' సినిమా 24న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దీంతో వరుణ్ తేజ్ తన తదుపరి చిత్రాలను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు. 
 
ఈ విషయమై వరుణ్ విలేకర్లతో మాట్లాడుతూ.. 'ముకుంద' షూటింగ్ ప్రారంభ దశలోనే మరో రెండు చిత్రాలను అంగీకరించినట్లు తెలిపారు. 'ముకుంద' తర్వాత వెంటనే చేసే చిత్రం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఉంటుందని చెప్పారు. 
 
అసలు 'హార్ట్ ఎటాక్' చిత్రాన్నితన తొలి చిత్రంగా పూరీతో చేయాల్సివుందని, కథ నచ్చినా ఇతర కారణాల వల్ల అది చేయలేకపోయానని చెప్పారు. అందుకే, ఇప్పుడు పూరీతో చేస్తున్నానని అన్నారు. 
 
అదేవిదంగా క్రిష్ దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి అంగీకరించానని వరుణ్ వెల్లడించారు. ఈ రెండు ప్రాజక్టులు వచ్చే ఏడాది సెట్స్ కి వెళతాయి మెగా హీరో తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu