Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వరుణ్ సందేశ్ లవకుశ ట్రైలర్.. వీడియో చూడండి.!

వరుణ్ సందేశ్ లవకుశ ట్రైలర్.. వీడియో చూడండి.!
, సోమవారం, 23 ఫిబ్రవరి 2015 (18:58 IST)
వరుణ్ సందేశ్ తాజాగా నటిస్తున్న లవకుశ టీజర్ విడుదలైంది. వరుస ఫ్లాపులతో సతమవుతున్న వరుణ్ ఈ సినిమాపై గంపెడు ఆశలు పెట్టుకున్నాడు. సోలో హీరోగా తనేంటో నిరూపించుకోవాలని చూస్తున్న 'కొత్త బంగారులోకం' ఫేమ్‌ వరుణ్‌ సందేశ్‌ లవకుశలో డ్యూయల్‌ రోల్‌ చేశాడు. ఈ సినిమా గురించి వరుణ్ సందేశ్ చెప్తూ.. ఈ మూవీలో రెండు పాత్రలు పోషించాను. అద్భుతంగా వుంటుందన్నాడు. 
 
ఔట్‌ అండ్‌ ఔట్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. ఎవరైనా ఎపుడైనా చిత్రంలో నేను చేసిన కామెడీ బాగా వర్కవుట్‌ అయింది. ఈ చిత్రం విషయానికి వస్తే డైరెక్టర్‌ శివకి సూపర్‌ క్లారిటీ వుంది. తను తియ్యాలనుకున్నది హండ్రెడ్‌ పర్సెంట్‌ తీసి చూపించాడు. టీజర్‌ చూసి అందరూ బాగుంది, చాలా క్వాలిటీ వుంది అంటున్నారంటే దానికి ముఖ్య కారణం మా నిర్మాతలు అని చెప్పాడు. 
 
ఇలా ప్రతి సినిమాకూ చెబుతున్నాడు. మరి ఈ లవకుశ గట్టెక్కించేనా చూడాల్సిందే.  జిఆర్‌89 ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై జయ్‌ శ్రీశివన్‌ని దర్శకుడుగా పరిచయం చేస్తూ వి.సత్యమోహన్‌రెడ్డి, ఎస్‌.ప్రకాష్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే నెలలో విడుదల చేయనున్నారు.

 

Share this Story:

Follow Webdunia telugu