Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

30 ఏళ్ల స్నేహానికి అలీ ద్రోహం చేశాడు: శివాజీ రాజా

30 ఏళ్ల స్నేహానికి అలీ ద్రోహం చేశాడు: శివాజీ రాజా
, బుధవారం, 25 మార్చి 2015 (18:14 IST)
30 ఏళ్ల స్నేహానికి అలీ ద్రోహం చేశాడని, అలీ నమ్మక ద్రోహం చేస్తాడని అస్సలు ఊహించలేదని నటుడు శివాజీ రాజా అన్నాడు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శివాజీ రాజా మాట్లాడుతూ.. తాను జీవితంలో అబద్దాలు ఆడబోనని, ముక్కుసూటిగా వెళ్తానని, బెదిరింపులకు తలొగ్గేది లేదని అన్నాడు. తాను మురళీమోహన్ దగ్గర 14 సంవత్సరాలు, మోహన్ బాబు దగ్గర 2 ఏళ్లు సెక్రటరీగా పనిచేశానని శివాజీ రాజా చెప్పుకొచ్చాడు. 
 
మోహన్ బాబు దగ్గర చేసినప్పుడు కోటికి పైగా వసూళ్లు రావాల్సినప్పుడు పగలు, రాత్రి ఎంతో కష్టపడ్డానని, అలాగే ఆయన కూడా తనకు ఎంతో మద్దతు పలికారని పేర్కొన్నాడు. అయినా తనకు తృప్తి కలగలేదని శివాజీ రాజా పేర్కొన్నాడు. 'మా' నుంచి పాతవాళ్లంతా తప్పుకొని, కొత్తవాళ్లకు అవకాశం ఇద్దామని మురళీమోహన్ గారే చెప్పారని శివాజీ రాజా తెలిపాడు. 
 
రాజేంద్రప్రసాద్ గురించి శివాజీ రాజా మాట్లాడుతూ, అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి రాజేంద్రప్రసాద్ అని తెలిపారు. ప్రెసిడెంటుగా పోటీకి ఎవరూ సంసిద్ధత వ్యక్తం చేయకపోవడంతో, తామే వెళ్లి ఆయనను మా అధ్యక్షుడిగా పోటీ చేయాలని అడిగామని వెల్లడించాడు. మూవీ ఆర్టిస్టు అసోసియేషన్‌కు మంచి చేద్దామని రాజేంద్ర ప్రసాద్ ముందుకొచ్చాడని, ఆయనకు మద్దతుగా ఉన్నామని శివాజీ రాజా తెలిపాడు. అయితే తన ఓటు రాజేంద్రప్రసాద్ కేనని తెలిపిన శివాజీ రాజా... రాజేంద్రప్రసాద్ ప్యానల్ నుంచి సెక్రటరీగా పోటీ చేయడం లేదని, పోటీ నుంచి విరమించుకుంటున్నానని స్పష్టం చేశాడు.

Share this Story:

Follow Webdunia telugu