Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'ఉత్తమ విలన్' రెడీ... ఏప్రిల్ 2న విడుదలకు సన్నాహాలు..!

'ఉత్తమ విలన్' రెడీ... ఏప్రిల్ 2న విడుదలకు సన్నాహాలు..!
, మంగళవారం, 3 ఫిబ్రవరి 2015 (13:07 IST)
లోకనాయకుడు కమల్ హాసన్ నటిస్తున్న తర్వాత చిత్రం 'ఉత్తమ విలన్'. ఈ చిత్రం విడుదలకు తేదీ కుదిరింది. ఈ సినిమా ఆడియోను మార్చి ఒకటో తేదిన విడుదల చేస్తుండగా, ఏప్రిల్ రెండో తేదిన చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్ణయించినట్టు నిర్మాతలు వెల్లడించారు. 
 
ఈ విషయాన్ని చిత్ర నిర్మాతల్లో ఒకరైన లింగుస్వామి ట్విట్టర్ ద్వార తెలిపారు. అంతేకాకుండా కథ, స్క్రీన్ ప్లే సమకూర్చడంతో పాటు ఈ సినిమాలో కమల్ రెండు పాత్రలు పోషిస్తున్నారు. అందులో ఒకటి కళాకారుడి పాత్ర. 
 
గతంలో విడుదలైన కమల్ హాసన్ విశ్వరూపం చిత్రంలో కీలక పాత్ర పోషించిన నటి ఆండ్రియా, ఈ చిత్రంలో కూడా నటించింది. కాగా కమల్ సినీ గురువు, దివంగత దర్శకుడు కె. బాల చందర్ ఈ సినిమాలో ఓ ప్రముఖ పాత్రను పోషించడం విశేషం.

Share this Story:

Follow Webdunia telugu