Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉదయ్ కిరణ్ ఎలా మరణించాడంటే... ఫోరెన్సిక్ రిపోర్ట్ వివరం...

ఉదయ్ కిరణ్ ఎలా మరణించాడంటే... ఫోరెన్సిక్ రిపోర్ట్ వివరం...
, బుధవారం, 20 ఆగస్టు 2014 (19:00 IST)
టాలీవుడ్ యూత్ హీరో సినీ నటుడు ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకోవడం జనవరి మొదట్లో సినీ పరిశ్రమను కుదిపేసింది. కెరీర్ పరంగా మంచి భవిష్యత్ వున్న సమయంలో ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు పాల్పడటమేంటి అని అందరూ అనుకున్నారు. అసలు ఉదయ్‌ కిరణ్‌ బలవన్మరణానికి కారణాలేమిటి? అనే సందేహాలు కొందరు లేవనెత్తారు కూడా. ఐతే తాజాగా ఆయన ఆత్మహత్య చేసుకున్న నేపధ్యం ఎలా జరిగింది? మరణం ఎలా సంభవించిందనే దానిపై ఫోరెన్సిక్ రిపోర్టు పోలీసులకు ఇవాళ చేరింది.
 
ఫోరెన్సిక్ రిపోర్టులో ఆత్మహత్యకు ముందు ఉదయ్ కిరణ్ మద్యం సేవించాడని తేటతెల్లమైంది. ఈ ఫోరెన్సిక్ రిపోర్టు ఇంకా పలు విషయాలను వెల్లడించింది. ఉదయ్ కిరణ్ ఉరి వేసుకోవడంతో ఊపిరి ఆడక ప్రాణాలు కోల్పోయినట్లు సూచించింది.
 
ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకునే ముందు తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నట్లు తేలింది. దీనికితోడు బాగా మద్యం సేవించి ఉన్నట్లు రిపోర్టులో వెల్లడయింది. మద్యం సేవించిన ఉదయ్ కిరణ్ మానసిక ఒత్తిడిలో ఆత్మహత్యకు పాల్పడినట్లు తేలింది.
 

Share this Story:

Follow Webdunia telugu