Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'కత్తి' బ్యానర్‌ వివాదం... చెన్నైలో థియేటర్లపై విధ్వంసం

'కత్తి' బ్యానర్‌ వివాదం... చెన్నైలో థియేటర్లపై విధ్వంసం
, మంగళవారం, 21 అక్టోబరు 2014 (12:22 IST)
ఇలయ దళపతి విజయ్, సమంతలు హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'కత్తి' పై నెలకొన్న వివాదం రోజురోజూకు రాజుకుంటోంది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన కత్తి చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. అయితే ఈ నిర్మాణ సంస్థతో శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సేకు సంబంధాలున్నాయంటూ ఆరోపణలు వెలువడడం వివాదానికి దారితీసింది. 
 
అసలే ఈళం తమిళుల ఊచకోత ఘటనలతో రాజపక్సపై మండపితోన్నతమిళ ప్రజలు కత్తి చిత్ర బ్యానర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రం బ్యానర్ నుంచి లైకా పేరు తొలగించాలని వారు కత్తి నిర్మాతలను డిమాండ్ చేస్తున్నారు. అయితే కత్తి చిత్రాన్ని బుధవారం ఎట్టి పరిస్థితుల్లోనైనా విడుదల చేసి తీరుతామని నిర్మాతలు స్పష్టం చేశారు. 
 
ఈ స్థితిలో సోమవారం అర్థరాత్రి చెన్నై మహానగరంలోని మౌంట్‌ రోడ్డులో ఉన్న రెండు సినిమా థియేటర్లపై తమిళ సంఘాల వాళ్లు రాళ్లు రువ్వి, పెట్రోల్ బాంబులు విసిరి విధ్వంసం సృష్టించారు. దీంతో తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా థియెటర్ల వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సినిమా థియేటర్ల వద్ద భారీగా పోలీసులను మెహరించారు. ఈ సంఘటనపై పోలీసులు ఆరుగురిని అరెస్టు చేసి విచారిస్తున్నట్టు సమాచారం.

కాగా గతంలో విజయ్ నటించిన 'తలైవా' చిత్రం విడుదలకు అనేక సమస్యలు వచ్చిన విషయం తెలిసిందే. 'అమ్మ'కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినందుకు ఆ సినిమా విడుదల సందర్భంగా సమస్యలు ఏర్పడ్డాయి. తమిళంలో కంటే తెలుగులో ముందు విడుదలైంది. ఈ గందరగోళం పుణ్యమా అని ఆ సినిమా కూడా ఫ్లాప్ అయింది. ఇప్పుడు అలాంటి పరిస్థితి మరోసారి విజయ్‌కు ఎదురవుతోంది.

Share this Story:

Follow Webdunia telugu