Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

త్రిషకు నిశ్చితార్థం ఎఫెక్ట్!: ఆఫర్లు గోవిందో గోవిందా!

త్రిషకు నిశ్చితార్థం ఎఫెక్ట్!: ఆఫర్లు గోవిందో గోవిందా!
, సోమవారం, 24 నవంబరు 2014 (11:07 IST)
త్రిషపై నిశ్చితార్థం ఎఫెక్ట్ బాగా పడుతోంది. దక్షిణాది హీరోయిన్‌గా రాణిస్తున్న అందాల నాయిక త్రిష ఇటీవల వివాహ నిశ్చితార్థం జరిగిందన్న వార్తలు ఆమె కెరీర్‌పై ప్రభావం చూపాయి. 
 
ఎంగేజ్ మెంటు వార్తలో వాస్తవం లేదని ఆమె వెంటనే ప్రకటించినప్పటికీ, కోలీవుడ్ మాత్రం ఆమె మాటల్ని నమ్మడం లేదు. హఠాత్తుగా పెళ్లి చేసేసుకుంటే తమ సినిమాకు ఎక్కడ ఇబ్బంది కలుగుతుందోనన్న ఉద్దేశంతో ఇప్పటికే ఆమెను బుక్ చేసుకున్న కొందరు నిర్మాతలు మెల్లగా డ్రాప్ అవుతున్నారట. 
 
ఈ నేపథ్యంలో జయ్ హీరోగా మణిమారన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం నుంచి కూడా త్రిషమ్మను తొలగించినట్టు సమాచారం. ఆమె స్థానంలో సురభిని తీసుకున్నారని కోలీవుడ్ వర్గాల సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu