Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పెళ్లి మాట పక్కనెట్టిన త్రిష.. మళ్లీ ఆ హీరోతో లిప్‌లాక్ ముద్దులకు సై..!

పెళ్లి మాట పక్కనెట్టిన త్రిష.. మళ్లీ ఆ హీరోతో లిప్‌లాక్ ముద్దులకు సై..!
, సోమవారం, 4 మే 2015 (11:50 IST)
టాలీవుడ్, కోలీవుడ్‌లలో క్రేజీ బ్యూటీగా వెలుగుతున్న బ్యూటీ త్రిష. ఇటీవల ప్రియుడు వరుణ్ మణియన్‌తో పెళ్లికి సిద్ధమైన అమ్మడు నిశ్చితార్థం కూడా చేసుకుంది. అందుకు సినీ స్నేహితులకు గ్రాండ్ ట్రీట్ కూడా ఇచ్చింది. అయితే వారి మధ్య మనస్పర్ధల కారణంగా వరుణ్‌తో పెళ్లి క్యాన్సల్ అయినట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. 
 
ఆ గాసిప్‌కు బలనాన్ని చేకూర్చే రీతిలో త్రిష తాజాగా ఒక సమాచారాన్ని తెలిపింది. పెళ్లి మాట పక్కన పెట్టి, లిప్‌లాక్‌ ముద్దులకు ఓకే చెప్పింది. గతంలో తమిళంలో వచ్చిన 'విన్నై తాండి వరువాయా' చిత్రంలో శింబుతో లిప్ లాక్ కిస్ సీన్లు చేసిన ఈ బ్యూటీ, ఇప్పుడు మళ్లీ అతనితో అలాంటి ముద్దులు గుప్పించడానికి రెడీ అంటోంది. 
 
త్రిష తాజాగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనుంది. అందులో లిప్‌లాక్ కిస్ సన్నివేశాలు వున్నాయని ఆమెకు చెప్పారట. అందుకు ఆమె ఏమాత్రం అభ్యంతరం చెప్పకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దీంతో ఈ బ్యూటీ తెగువకు అందరూ ఆశ్చర్యపోతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu