Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏమయ్యా... తెలంగాణ నుంచి ఇండస్ట్రీని వెళ్లగొట్టేదాకా...?

ఏమయ్యా... తెలంగాణ నుంచి ఇండస్ట్రీని వెళ్లగొట్టేదాకా...?
, శుక్రవారం, 11 జులై 2014 (21:10 IST)
కొన్ని విషయాలు కొందరికి ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేస్తాయి. అవతలివారు ఆనందంగా ఉంటే.. ఏదైనా నెగెటివ్‌ టచ్‌తో మాట్లాడటం.. కొందరికే చెల్లుతుంది. అందరూ అలాగే ఉండరు కదా... దీనికొక ఉదాహరణ చెప్పాలి. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలో వెంకటేష్‌ కనిపించినప్పుడల్లా.. ఏం చేస్తున్నావ్‌... అంటూ అందరూ అడుగుతారు. 
 
ఆయన కుటుంబ సభ్యుడు మేనమామ కూడా అయిన రావురమేష్‌ కూడా ఏం చేస్తున్నావ్‌.. అంటూ వెటకారంగా ప్రశ్నిస్తే... వెంకటేష్‌కు ఎక్కడో కాలుతుంది. వీళ్ళ బాబు.. వీరికి బతకడం నేర్పలేదంటూ.. మళ్లీ సెటైర్‌ వేస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలిసిందే... ఇదంతా ఎందుకంటే.. సరిగ్గా ఈ సన్నివేశాన్ని తలపించేలా.... ఇండస్ట్రీ ఉందట.
 
ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాత తెలియజేస్తున్నారు. ఆయనకు స్టూడియో కూడా ఉంది. కాజువల్‌గా ఆయన్ను కలిసిన వెంటనే వార్తాహరుడు వేసిన ప్రశ్నకు నిర్మాత ఇచ్చిన సమాధానం.... ఏమయ్యా.. హాయిగా ఇండస్ట్రీ హైదరాబాద్‌లో ఉండటం మీకు ఇష్టం లేదా? ఏదో పుల్లపెట్టి... ఏదో విధంగా ఇక్కడ నుంచి వెళ్ళగొట్టేవరకు నిద్రపోరేమిటి? అంటూ అంతే చనువుగా అతనితో అనడం విశేషం. ఈ ప్రశ్న వేసిన వ్యక్తి తెలంగాణాకు చెందినవారు. 
 
ఆ నిర్మాత చెప్పిన సమాధానంతో... ఏకీభవిస్తూ కరెక్టేనండి.. కానీ మాకంటే మైకులున్న మీడియా మరీను... ఇండస్ట్రీ గురించి తెగ కథనాలు ప్రచారం చేసేస్తుంది. దీంతో అగ్ర నిర్మాతలు ఏదో ఒకటి మాట్లాడాల్సిన అవసరం ఉందని క్లారిటీ ఇచ్చాడు. నిజంగా హైదరాబాద్‌లో ఇండస్ట్రీ ఉండడం వల్ల ఎంతోమందికి ఉపాధి వస్తుంది. 
 
ఇప్పటికే కొన్ని లక్షల కుటుంబాలు ఇళ్లు, వాకిళ్లు, ఆస్తులు అన్నీ సమకూర్చుకున్నారు. వీరంతా మరోచోటకి వెళ్ళి చేసేదేమిటి? దీనివల్ల ఎవరికైనా ఉపయోగమా? అనే ప్రశ్నలూ లైన్లో వచ్చాయి. దానికితోడు అలా అంటగా..! ఇలా అంటగా! అంటూ కథనాలు వేస్తుంటారు. ఇవన్నీ వారివారి విజ్ఞతకే వదిలేస్తున్నానంటూ నిర్మాత అనేసరికి టాపిక్‌ అంతటితో ఆగిపోయింది.

Share this Story:

Follow Webdunia telugu