Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మద్యం మత్తులో యువకుడిపై దాడి... సినీ నటుడు ఉదయ్ కిరణ్ అరెస్టు..!

మద్యం మత్తులో యువకుడిపై దాడి... సినీ నటుడు ఉదయ్ కిరణ్ అరెస్టు..!
, ఆదివారం, 19 ఏప్రియల్ 2015 (11:17 IST)
మద్యం సేవించిన మత్తులో యువకిడిపై దాడి చేసిన సినీ నటుడు నండూరి ఉదయ్ కిరణ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్ నగర్‌కు చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ఎంవీఎస్ ఎస్ ప్రవీణ్ కుమార్ శనివారం జూబ్లీహిల్స్ రోడ్ నెం.36లోని ఎయిర్ పబ్ వద్దకు వచ్చాడు. 
 
అదే సమయంలో మద్యం తాగి ఎయిర్ పబ్ నుంచి కిందకు దిగిన ఉదయ్ కిరణ్ ప్రవీణ్‌ను గమనించాడు. గతంలో ఉన్న పాతకక్షల నేపథ్యంలో ప్రవీణ్‌పై ఉదయ్‌కిరణ్‌‌ దాడి చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఉదయ్ కిరణ్ తో పాటు ప్రవీణ్ అనే వ్యక్తిని కూడా అరెస్టు చేసారు.
 
అనంతరం ఉదయ్‌కిరణ్‌పై 506, 326 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సినీ నటుడు  ఉదయ్ కిరణ్ ‘పరారె' చిత్రంలో నటించారు. కాగా ఆ మధ్య డ్రగ్స్ కేసులో ఉదయ్ కిరణ్ సంబంధం ఉన్నట్టు సమాచారం వెల్లడైన విషయం తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu