Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కేన్స్‌లో ఐశ్వర్యా రాయ్ ఆంటీని ఎవరు చూస్తారు... నన్నే చూస్తారు... సోనమ్ కపూర్...?!!

కేన్స్‌లో ఐశ్వర్యా రాయ్ ఆంటీని ఎవరు చూస్తారు... నన్నే చూస్తారు... సోనమ్ కపూర్...?!!
, బుధవారం, 13 మే 2015 (14:47 IST)
మాజీ ప్రపంచసుందరి, బాలీవుడ్ అందాల తార, సెక్సీ నవ్వుల హీరోయిన్ ఐశ్వర్యా రాయ్ ఒక్క నవ్వేస్తే చాలు... కుర్రాళ్లు కిక్కెక్కిపోతారు. అది ఒకప్పటి మాట అంటుంది బాలీవుడ్ సెక్సీ హీరోయిన్ సోనమ్ కపూర్. అసలు ఐశ్వర్యా రాయ్ ఆంటీతో నాకు పోలికేంటి అనేసింది కూడా. ఈ గొడవంతా గతంలో కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్ సమయంలో జరిగిపోయింది. అప్పుడు దీనిపై ఐశ్వర్యా రాయ్ కూడా పెద్దగా స్పందించలేదు. 
 
కానీ ఇప్పుడు 68వ కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్ మహోత్సవం మే 13 నుంచి.. అంటే ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ ఫెస్టివల్ లో రెడ్ కార్పెట్ పై నడుస్తూ హొయలు పోవడం, హాలీవుడ్ ఇండస్ట్రీతోపాటు ప్రపంచం దృష్టిని తమవైపు తిప్పుకోవడం కోసం తారలు తెగ ఆరాటపడుతుంటారు. ఇందులో భాగంగా గతంలో ఐశ్వర్యారాయ్ కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్స్‌లో పాల్గొని వహ్వా అనిపించుకుంది కూడా. 
 
ఈ ఫెస్టివల్లో ఆమె 14వ సారి పాల్గొనబోతోంది. ఈ నేపధ్యంలో మరోసారి రెడ్ కార్పెట్ పై నడిచేందుకు సిద్ధమైపోయింది. ఐతే సోనమ్ కపూర్ కూడా ఇదే వేడుకలో పాల్గొనబోతోంది. ఇప్పుడిక తనే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అంటోంది. ఇండియన్ ఫిలిమ్ ఇండస్ట్రీ నుంచి తనకు సాటి ఎవరూ లేరన్న ధీమాతో ఉంది. గతంలోనే ఐశ్వర్య ఆంటీ అని వ్యాఖ్యానించిన సోనమ్ కపూర్, ఈసారి ఐశ్వర్యా రాయ్ పై ఎలాంటి వ్యాఖ్యలు చేస్తుందో వెయిట్ అండ్ సీ.

Share this Story:

Follow Webdunia telugu