Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బేబీ అదృష్టం తగిలింది... పందెం కోళ్లుతో వస్తున్నా... తాప్సీ

బేబీ అదృష్టం తగిలింది... పందెం కోళ్లుతో వస్తున్నా... తాప్సీ
, బుధవారం, 28 జనవరి 2015 (15:01 IST)
సినిమా రంగంలో జయాపజయాలు మామూలే. దక్షిణాదిలో పలు చిత్రాల్లో నటించాను. కొన్ని మంచి పేరు తెచ్చాయి. మరికొన్ని తేలేదు. హిందీలో నేను చేసిన బేబి చిత్రం మంచి పేరుతోపాటు లక్క్‌ను తెచ్చిపెట్టిందని చెబుతోంది తాప్సీ. 
 
ఆ చిత్రం తర్వాత పలువురు దర్శకులు తనను సంప్రదస్తున్నారనీ.. హిందీలో మంచి అవకాశాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తుంది. అయితే దక్షిణాదిలో సక్సెస్‌ లేకపోతే బాలీవుడ్‌లో వస్తాయని గ్యారంటీ లేదు. ఎక్కడైనా ప్రేక్షకులు ఒక్కలాగే వుంటారు. కాలాన్ని బట్టి వారు రిసీవ్‌ చేసే విధానం చాలా పేరు తెచ్చిపెడుతుంది. 
 
ఈ విషయాన్ని నేను ఎప్పుడూ మర్చిపోలేను అని చెబుతోంది. తాజాగా తెలుగులో ధనుష్‌తో నటించిన డబ్బింగ్‌ సినిమా  పందెం కోళ్లుతో ఈ నెల 30న రానుంది. ఈ చిత్రం కూడా తెలుగులో మంచి గుర్తింపు తెస్తుందని చెబుతోంది.

Share this Story:

Follow Webdunia telugu