Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆ ముగ్గురు హీరోయిన్ల కంటే తమన్నా సూపర్ హాట్... నాగ్ కామెంట్

ఆ ముగ్గురు హీరోయిన్ల కంటే తమన్నా సూపర్ హాట్... నాగ్ కామెంట్
, మంగళవారం, 29 జులై 2014 (14:49 IST)
గ్రీకు వీరుడు నాగార్జున ప్రత్యేకించి ఓ హీరోయిన్ హాటెస్ట్ అన్నారంటే ఇంకేముంది ఆ హీరోయిన్ కు పండగే. ఇపుడా అదృష్టం పాలపిల్ల తమన్నాకు దక్కింది. విషయం ఏంటయా అంటే, తాజాగా ఓ టెలివిజన్ షోలో సీనియర్ నటి సుహాసినితో గెస్ట్ గా ఓ ప్రోగ్రాములో నాగార్జున పాల్గొన్నాడు. ఆ కార్యక్రమంలో సుహాసిని సరదా ప్రశ్నలు కొన్నింటిని నాగ్ పై సంధించింది.
 
ఈ సందర్భంగా సుహాసిని నాగార్జునకు ఓ ప్రశ్న వేస్తూ... ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్‌లో మీకు హాట్‌గా అనిపించిన హీరోయిన్ ఎవరంటూ నలుగురు హీరోయిన్ల పేర్లు చెప్పింది. వారిలో సమంత, కాజల్ అగర్వాల్, శృతిహాసన్, తమన్నా పేర్లు చెప్పింది. దానికి నాగ్ ఏమన్నాడంటే, నలుగురూ హాట్ బ్యూటేసే... ఐతే అందరికంటే తమన్నా వెరీ హాటెస్ట్ అని చెప్పేశాడు. 
 
అంతే, సుహాసిని దీనిపై ఇక ఎంతమాత్రం చర్చించలేదు. తమన్నా ఎందుకు హాటెస్ట్... మిగిలిన ముగ్గురు ఎందుక్కాదు వగైరా ప్రశ్నలు వేస్తే చర్చ ఏ దారికి వెళుతుందనుకుందో ఏమోగానీ అంతటితో ఆ టాపిక్ కు కట్ చెప్పేసింది.

Share this Story:

Follow Webdunia telugu