Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సల్మాన్‌తో సినిమా చేస్తా.. న్యూ ఎక్స్ పెండబుల్స్ కావొచ్చేమో: స్టాలోన్

సల్మాన్‌తో సినిమా చేస్తా.. న్యూ ఎక్స్ పెండబుల్స్ కావొచ్చేమో: స్టాలోన్
, శనివారం, 23 మే 2015 (13:50 IST)
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌కు ఉన్న ఫాలోయింగ్ అంతాఇంతా కాదు. ఆయన కోట్లాది మంది అభిమాని హీరో అయితే, ఆయన అభిమాన హీరో మాత్రం సిల్వెస్టర్ స్టాలోన్. ఇప్పుడా అభిమాన హీరో సల్మాన్ కు కితాబిచ్చారు. ప్రతిభావంతుడైన సూపర్ స్టార్ అంటూ ట్వీట్ చేశారు. అంతేగాదు, ఇద్దరం కలిసి ఓ సినిమా చేద్దామని, బహుశా అది 'న్యూ ఎక్స్ పెండబుల్స్' సినిమా అవ్వచ్చేమో అని కూడా స్టాలోన్ ట్విట్టర్లో పేర్కొన్నారు. 
 
స్టాలోన్ నటించిన 'ఎక్స్ పెండబుల్స్' సిరీస్ చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించాయి. అంతకుముందు, సల్మాన్ ట్విట్టర్లో తన అభిమాన హీరో గురించి ఫ్యాన్స్ కు సూచనలు చేశారు. "అభిమానులూ... స్టాలోన్... మీ హీరోకే హీరో... ఆయనను ట్విట్టర్లో ఫాలో అవండి" అంటూ ట్వీట్ చేశారు. దీనిపైనే స్టాలోన్ స్పందించారు.

Share this Story:

Follow Webdunia telugu