Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్వేతాబసు తల్లి పిటీషన్... కోర్టు ఓకే అంటే వెళ్లేందుకు సిద్ధం

శ్వేతాబసు తల్లి పిటీషన్... కోర్టు ఓకే అంటే వెళ్లేందుకు సిద్ధం
, బుధవారం, 10 సెప్టెంబరు 2014 (19:41 IST)
తన కూతురు టాలీవుడ్ నటి శ్వేతాబసును తమకు అప్పగించాలని శ్వేతాబసు తల్లి న్యాయస్థానంలో పిటీషన్ వేశారు. తమ కుమార్తెను ఇకపై చాలా జాగ్రత్తగా చూసుకుంటామని నిత్యం ఆమె వెన్నంటి ఉంటానని ఆమె కోర్టుకు తెలిపిన పిటీషన్లో పేర్కొన్నారు. శ్వేతాబసు తల్లి పిటీషన్ పై జడ్జి విచారించిన తర్వాత ఆమె తల్లితో వెళ్లేందుకు అంగీకరించినట్లుగా సమాచారం. శ్వేతాబసును రెస్క్యూ హోం నుంచి  పంపాలంటే ఆమె కుటుంబ పరిస్థితిపై నిర్వాహకులు కోర్టుకు నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. ఆ నివేదిక వచ్చాక కోర్టు తన నిర్ణయాన్ని వెలువరిస్తుంది.
 
కాగా హైదరాబాదులో ఓ నక్షత్ర హోటల్ లో వ్యభిచారం కేసులో పట్టుబడి అరెస్టైన నటి శ్వేతబసు ప్రసాద్ హైదరాబాద్‌లోని రెస్క్యూ హోంలో తోటి మహిళలు, ఇతర పిల్లలతో సరదా సరదాగా గడుపుతున్నట్లు సమాచారం. రెస్క్యూ హోంలోని పిల్లలు, మహిళలతో సంగీతం, జీవితం గురించిన విషయాలను చెబుతూ వారితో శ్వేతబసు సరదాగా ఉంటున్నట్లు కేసు అటెండింగ్ జడ్జీ ఆమె తల్లితో వెల్లడించినట్లు సమాచారం. 
 
మరోవైపు శ్వేతాబసు విషయంలో మీడియా, పోలీసులు వ్యవహరించిన తీరుపట్ల బాలీవుడ్, టాలీవుడ్ నుంచి  విమర్శలు మెల్లమెల్లగా వస్తూ ఉన్నాయి. కొంతమంది సెలబ్రిటీలు ఆమెకు అండగా నిలుస్తుండగా మరికొందరు ఇపుడిపుడే లైన్లోకి వస్తున్నారు. లేటెస్ట్ గా శ్వేతాబసుకు మద్దతుగా మంచు విష్ణు నిలబడ్డారు. 
 
శ్వేతాబసు విషయంలో అనవసరంగా ఆమె పేరును బయటపెట్టి క్లయింట్లను దాచేశారని మండిపడ్డారు. అమ్మాయి అంటే అంత నెగటివ్ ఎందుకో తెలియడంలేదు. ఇండస్ట్రీలో ఏది జరిగినా భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారు. అదేమంటే విలువలు గురించి మాట్లాడుతూ ఉంటారు. మనకసలు విలువలు ఎక్కడున్నాయి..? సన్నీ లియోన్ ఎవరు..? 
 
ఆమెను హిందీ చిత్ర పరిశ్రమ పెద్ద స్టార్ ను చేసేసింది. నేను కూడా ఆమెను కరెంటు తీగలో పెట్టాను. భవిష్యత్తులో శ్వేతా బసుకు కూడా ఆఫర్ ఇస్తాను. అంటూ చెప్పారు మంచు విష్ణు. ఇప్పటికే  హిందీ టీవీనటి సాక్షి తన్వర్, డైరెక్టర్ రాజమౌళి కూడా శ్వేతకు మద్దతు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu