Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హృతిక్ కు షాకిచ్చిన భార్య... రూ.400 కోట్లు ఇస్తే నిన్నొదులుతా...

హృతిక్ కు షాకిచ్చిన భార్య... రూ.400 కోట్లు ఇస్తే నిన్నొదులుతా...
, బుధవారం, 30 జులై 2014 (22:16 IST)
'కహోనా ప్యార్ హై' సినిమాతో బాలీవుడ్ ఎంట్రీతోనే సిల్వర్‌ స్క్రీన్‌పై రికార్డుల మోత మోగించాడు హృతిక్ రోషన్. క్రిష్ తో ప్రేక్షకులకు కిక్ ఎక్కించాడు. ధూమ్‌తో దుమ్ము రేపాడు. కలెక్షన్లతో హోరెత్తించాడు. ఇదంతా రీల్ లైఫ్‌. ఇవన్నీ భారీ బడ్జెట్ చిత్రాలే. చిత్రమేమంటే బట్‌ రియల్ లైఫ్‌లోనూ హృతిక్ భారీ సెటిల్‌మెంట్‌తో భార్యను వదిలించుకునేందుకు సిద్ధమవుతున్నాడు.
 
హృతిక్‌ నుంచి 400 కోట్లు మనోవర్తి కోరిన భార్య 
"బ్యాంగ్‌ బ్యాంగ్‌" ట్రైలర్‌ క్లిక్స్‌తో మంచి కిక్‌ మీదున్నాడు క్రిష్‌. అయితే ఈ ఆనందం మరెంతో కాలం ఉండేలా లేదు. హృతిక్‌కు సుజేనా భారీ షాక్ ఇచ్చింది మరి. హృతిక్‌ను అతని భార్య సుజానే మనోవర్తి కింద 400 కోట్లు డిమాండ్ చేస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో పరస్పర అంగీకారంతో హృతిక్, సుజానేలు విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే.
 
హృతిక్‌, సుజానేల విడాకుల కేసు తుది తీర్పు అక్టోబర్ 31వ తేదీన వెలువడనుంది. ఇప్పటికే హృతిక్ దంపతులకు జన్మించిన హ్రిహాన్, హ్రేదాన్‌లను సుజానేలకు అప్పగించారు. విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత కూడా పిల్లలతో హృతిక్ దంపతులు కలిసి కనిపించడం మరో విశేషం.
 
పిల్లల కోసం కలిసి తిరుగుతున్న దంపతులు 
అయితే పిల్లల కోసం వ్యక్తిగత అభిప్రాయాలను, విభేదాలను పక్కన పెట్టాలని హృతిక్, సుజానేలు నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఇటీవల కాలంలో సుజానే కుటుంబ సభ్యులతో హృతిక్ కూడా చాలా క్లోజ్‌గా ఉంటున్నాడని సమాచారం. మరి మధ్యలో ఈ పితలాటకం ఏమిటో ఎవ్వరికీ అర్థం కావడంలేదు.

Share this Story:

Follow Webdunia telugu