Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాజమౌళి సర్... బాహుబలిలో ఒకే ఒక్క షాట్ ప్లీజ్... 'సికిందర్' సూర్య రిక్వెస్ట్

రాజమౌళి సర్... బాహుబలిలో ఒకే ఒక్క షాట్ ప్లీజ్... 'సికిందర్' సూర్య రిక్వెస్ట్
, గురువారం, 31 జులై 2014 (21:23 IST)
సూర్య, సమంత హీరోహీరోయిన్లుగా లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన 'సికిందర్' ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాదులోని శిల్పకళా వేదికలో గురువారం రాత్రి ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నటుడు సూర్య మాట్లాడుతూ... రాజమౌళి ఇచ్చిన పెద్ద ఆఫర్ ను తాను మిస్ చేసుకున్నాననీ, కనీసం బాహుబలి చిత్రంలో ఒక్క షాట్ లో అయినా నటించాలని కోరికగా ఉదని అన్నారు. స్టేజిపై నుంచి రాజమౌళి సార్ ప్లీజ్... బాహుబలిలో ఒకే ఒక్కషాట్ ప్లీజ్ అంటూ అడిగారు. సూర్య అలా అడిగేసరికి ప్రేక్షకులు పెద్దఎత్తున కేకలు, ఈలలు వేస్తూ చప్పట్లు కొట్టారు.
 
ఆ తర్వాత అక్కినేని నాగార్జున మాట్లాడుతూ... సమంత నా తల్లి అంటూ సమంతను ఆటపట్టించారు. ప్రతి ఒక్క సినిమాలో అవకాశాలను దక్కించుకుంటూ ముందుకు వెళుతోందని పొగడ్తలు కురిపించారు. ఇంకా సూర్య మంచి నటుడనీ, అలాగే మంచి వ్యక్తి కూడా అని కొనియాడారు. సూర్య చిత్రం సికిందర్ పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నానని అన్నారు. 
 
ఇంకా ఈ కార్యక్రమానికి మంత్రులు గంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu