Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మనోజ్‌కు ట్వీట్ విషెస్ చెప్పిన సన్నీ లియోన్!

మనోజ్‌కు ట్వీట్ విషెస్ చెప్పిన సన్నీ లియోన్!
, గురువారం, 29 జనవరి 2015 (13:50 IST)
కరెంట్ తీగ సినిమాలో మంచు మనోజ్, సన్నీ లియోన్ జంటగా నటించిన సంగతి తెలిసిందే. ఇదే పరిచయంతో సన్నీ లియోన్ మంచు మనోజ్‌కు విషెస్ చెప్పింది. ఎందుకో తెలుసా...? మంచు మనోజ్, ప్రణతి రెడ్డిల వివాహం నేపథ్యంలో సన్నీ లియోన్ బెస్ట్ విషెస్ తెలిపింది. 
 
బాలీవుడ్‌లో సెక్సీతారగా ఓ వెలుగు వెలుగుతున్న సన్నీ లియోన్ మంచు మనోజ్ వివాహానికి సంబంధించిన వార్తలొచ్చాక... మరిచిపోకుండా ట్విట్టర్ ద్వారా విషెస్ చెప్పింది. “Maonj, Congrats to you both and your families! I pray you are always happy!!” అంటూ ట్వీట్ చేసింది. 
 
కాగా మంచు మనోజ్, ప్రణతి రెడ్డిలు త్వరలో వివాహం చేసుకోబోతున్నారని ఆయన తండ్రి మోహన్ బాబు మీడియా ముందు ధ్రువీకరించిన సంగతి తెలిసిందే. ఇకపోతే.. రామ్ గోపాల్ వర్మ సినిమాలో మంచు మనోజ్ ప్రస్తుతం నటిస్తున్న సంగతి విదితమే. 

Share this Story:

Follow Webdunia telugu