Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సన్నీ లియోన్‌తో రానా... 'వన్ నైట్ స్టాండ్' చిత్రంలో...

సన్నీ లియోన్‌తో రానా... 'వన్ నైట్ స్టాండ్' చిత్రంలో...
, గురువారం, 18 సెప్టెంబరు 2014 (13:27 IST)
"లీడర్" తర్వాత చెప్పుకోదగిన విజయాన్ని చవిచూడలేక పోయిన దగ్గుబాటి రానాకు కాలం మాత్రం కలిసి వస్తోందనే చెప్పాలి. ప్రస్తుతం 'రుద్రమదేవి', 'బాహుబలి' వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తున్న రానా... బాలీవుడ్‌పై దృష్టిసారించాడు. లోగడ ఒక చిత్రంలో నటించినప్పటికీ.. అది ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయినప్పటికీ.. అవకాశాలు మాత్రం ఏమాత్రం తగ్గలేదనే చెప్పొచ్చు. 
 
ఇప్పటికే అక్షయ్ కుమార్‌తో కలసి 'బేబీ' సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా షూటింగులో కూడా జాయిన్ అయ్యాడు. ఇప్పుడు హిందీలో మరో చిత్రానికి సంతకం చేసినట్టు సమాచారం. జాస్మిన్ డిసౌజా దర్శకత్వంలో ఓ రొమాటిక్ ఫిలింలో నటించడానికి రానా ఓకే చెప్పాడు. ఈ చిత్రానికి "వన్ నైట్ స్టాండ్" అనే గమ్మత్తయిన టైటిల్ని కూడా ఖరారు చేసినట్టు సమాచారం. 
 
దీనిని బట్టే ఈ చిత్రం ఎలా ఉంటుందనేది మనం ఊహించుకోవచ్చు. ఈ చిత్రం విశేషం ఏమిటంటే, శృంగారతార సన్నీ లియోన్ ఇందులో రానా సరసన రొమాన్స్ చేస్తుంది. ఈ ఏడాది ఆఖరులో దీని షూటింగ్ ప్రారంభమవుతుంది. ఈలోగా తెలుగులో చేయాల్సిన ప్రాజక్టులని రానా పూర్తి చేస్తాడు. 

Share this Story:

Follow Webdunia telugu