Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

త్వరలో 'లీల' సీక్వెల్‌... సన్నీ హొయలు..!

త్వరలో 'లీల' సీక్వెల్‌... సన్నీ హొయలు..!
, గురువారం, 16 ఏప్రియల్ 2015 (17:56 IST)
బాలీవుడ్ సెక్సీ బాంబ్ సన్నీ లియోన్ నటించిన 'ఏక్ పహేలి లీల' ఘన విజయం సాధించింది. తాజాగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ప్రేక్షకులపై సన్నీ 'లీల' బాగా పనిచేస్తోందని బాలీవుడ్ వర్గాల టాక్. దీంతో 'లీల' సీక్వెల్‌లో కూడా సన్నీనే ఎంపిక చేశారట.
 
ఈ చిత్రం 12 కోట్ల బడ్జెట్టుతో నిర్మించగా, అప్పుడే 18 కోట్లు వసూలు చేసిపెట్టిందట. ఇంకా వసూళ్లు ఊపందుకుంటున్నాయని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో ఈ చిత్ర యూనిట్ సీక్వెల్‌కు రెడీ అవుతోంది.
 
దీనికి సంబంధించిన చిత్ర సహ నిర్మాత అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ.. అసలు 'లీల' షూటింగ్ జరుగుతున్న సమయంలోనే దీనికి సీక్వెల్ కూడా చేయాలని ప్లాన్ చేసినట్టు తెలిపారు. అయితే, దీని ఫలితాన్ని బట్టి ఆలోచిద్దామని అనుకున్నాము. ఇప్పుడు సినిమా మంచి హిట్టవడంతో ఇక సీక్వెల్‌కు వెళుతున్నామని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu