Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నటన వైపు సునీత చూపు.. మహేష్ చిత్రంలో ఛాన్స్..!

నటన వైపు సునీత చూపు.. మహేష్ చిత్రంలో ఛాన్స్..!
, సోమవారం, 20 ఏప్రియల్ 2015 (14:10 IST)
తెలుగు సినీ పరిశ్రమలో యాంకర్‌గా, గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా పేరుపొందిన సునీత నటన వైపు కూడా తన చూపును మళ్లించింది. పలు రంగాలలో ప్రసిద్ధి చెందిన సునీత త్వరలో నటిగా కూడా తన సత్తా చాటుకోనుంది. 1995 లో 'గులాబీ' సినిమాతో తన కెరీర్ మొదలుపెట్టిన సునీత గాయనిగా మంచి పేరు తెచ్చుకుంది.
 
ఇక తను కొన్ని ఛానెల్స్‌లో మ్యూజిక్ ప్రోగ్రామ్స్‌ని నిర్వహిస్తుంది. ఆమె సుమారు 750 సినిమాలకు పైగా డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా పనిచేసింది. పెద్ద టాప్ హీరోయిన్స్‌కి కూడా సునీత డబ్బింగ్ చెప్పింది. ఇక తను ఇప్పుడు నటిగా తన కెరీర్ మొదలు పెట్టబోతుంది. ఈమెను మహేష్ బాబు సినిమాలో నటించే ఛాన్స్ వరించింది.
 
ఇదివరకు పలు మార్లు, వివిధ దర్శకుల చిత్రాల్లో నటించే ఛాన్స్ వచ్చినా, సునీత సున్నితంగా తిరస్కరించింది. ఇక తను ఇప్పుడు తన నిర్ణయం మార్చుకొని సినిమాల్లో నటించేందుకు సిద్దమయ్యింది. అన్నీ రంగాల్లో చలాకీగా వ్యవహరించే సునీత వెండితెరపై కూడా తన సత్తా చాటుకోబోతుంది.

Share this Story:

Follow Webdunia telugu