Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సందీప్ కిషన్ కొత్త చిత్రం 'బీరువా' ఆడియో రిలీజ్‌ 24న!

సందీప్ కిషన్ కొత్త చిత్రం 'బీరువా' ఆడియో రిలీజ్‌ 24న!
, ఆదివారం, 21 డిశెంబరు 2014 (14:40 IST)
గతంలో ఎన్నో అత్యుత్తమ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ ఉషాకిరణ్‌ మూవీస్. అలాగే, 'ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు', 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌' వంటి సూపర్‌ హిట్‌ చిత్రాలను నిర్మించిన బ్యానర్‌ ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌. ఈ రెండు సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం 'బీరువా'. 
 
యంగ్‌  హీరో సందీప్‌ కిషన్‌, సురభి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత రామోజీరావు నిర్మిస్తున్నారు. కణ్మణి డైరెక్ట్‌ చేస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ పూర్తయింది. ఎస్‌.ఎస్‌.థమన్‌ సంగీత సారథ్యంలో రూపొందిన ఈ ఆడియోను డిసెంబర్‌ 24న చాలా గ్రాండ్‌గా రిలీజ్‌ చెయ్యబోతున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని రిలీజ్‌ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. 
 
ఈ చిత్రంలో నరేష్‌, ముఖేష్‌ రుషి, చలపతిరావు, అజయ్‌, సప్తగిరి, వేణు, షకలక శంకర్‌, గుండు సుదర్శన్‌, శివన్నారాయణ, అనితా చౌదరి, అనీషా సింగ్‌, సంధ్య తదితరులు ఇతర తారాగణంగా నటించారు. ఈ చిత్రానికి డ్యాన్స్‌: రాజు సుందరం, బాబా భాస్కర్‌, శేఖర్‌, ఫైట్స్‌: వెంకట్‌, పాటలు: శ్రీమణి, మాటలు: వెలిగొండ శ్రీనివాస్‌, ఆర్ట్‌: సాహి సురేష్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, సంగీతం: ఎస్‌.ఎస్‌.థమన్‌, సినిమాటోగ్రఫీ: ఛోటా కె.నాయుడు, లైన్‌ ప్రొడ్యూసర్‌: సుబ్రత్‌ రాయ్‌, నిర్మాత: రామోజీరావు, కథ- దర్శకత్వం: కణ్మణి.

Share this Story:

Follow Webdunia telugu