Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రీకాంత్ సరసన జరీన్ ఖాన్: గోవిందుడు తర్వాత రొమాంటిక్ డ్రామాగా..

శ్రీకాంత్ సరసన జరీన్ ఖాన్: గోవిందుడు తర్వాత రొమాంటిక్ డ్రామాగా..
, మంగళవారం, 24 మార్చి 2015 (13:21 IST)
గోవిందుడు అందరి వాడేలేలో రామ్ చరణ్ అంకుల్‌గా అందరినీ ఆకట్టుకున్న శ్రీకాంత్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో జరీన్ ఖాన్‌తో రొమాన్స్ చేసేందుకు ర రెడీ అవుతున్నాడు. కత్రినా కైఫ్‌లా కనబడే కత్రినా కైఫ్ శ్రీకాంత్ సరసన నటించేందుకు రెడీ అంటూ కామెంట్ ఇచ్చేసింది. సల్మాన్ ఖాన్ సరసన వీర్ అనే సినిమాలో ఎంట్రీ ఇచ్చిన జరీన్ ఖాన్ శ్రీకాంత్ సరసన రొమాన్స్ చేసేందుకు ఓకే చెప్పేసిందని టాలీవుడ్ వర్గాల సమాచారం. 
 
శ్రీకాంత్ హీరోగా నటించే సినిమాకు సుధీర్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే సుధీర్ రాజు హీరోయిన్ జరీన్ ఖాన్‌తో సంప్రదింపులు జరిపినట్లు బాలీవుడ్ జనం అనుకుంటున్నారు. ఇటీవల కాలంలో విడుదలైన జరీన్ ఖాన్ సినిమాలతో ఇంప్రెస్ కావడంతోనే శ్రీకాంత్ సినిమాకు ఎంపిక చేశామన్నారు. జరీన్ ఖాన్ అయితేనే ఆ రోల్ చేసేందుకు బాగుంటుందని సుధీర్ రాజు చెప్పారు. జల్సా రాయుడిగా రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా రొమాంటిక్ డ్రామా తెరకెక్కనుందని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu