Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చిన్న హీరోలకు నో... పెద్ద హీరో సరసకు రెడీ..!

చిన్న హీరోలకు నో...  పెద్ద హీరో సరసకు రెడీ..!
, బుధవారం, 25 ఫిబ్రవరి 2015 (12:12 IST)
కోలీవుడ్‌లో క్రేజీ బ్యూటీగా వెలుగుతున్న తెలుగమ్మాయి శ్రీదివ్య. తొలి రోజుల్లో చిన్న హీరోలతో నటించిన భారీ హిట్టులు కొట్టిన అమ్మడు, ఇప్పుడు చిన్న హీరోలను తిరస్కరిస్తోంది. 'బస్టాప్' సినిమాతో వెలుగులోకి వచ్చిన శ్రీదివ్య తమిళంలో వరుసగా మూడు నాలుగు సినిమాలు హిట్టవడంతో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. దాంతో ఆఫర్లు వచ్చిపడుతున్నాయి. 
 
ఒక్క సారిగా తనకు డిమాండు పెరిగిపోవడంతో ఈ చిన్నది తన పారితోషికాన్ని 50 లక్షలకు పెంచేసింది. అంతేకాదు, చిన్న హీరోల సినిమాలు ఎవాయిడ్ చేయడానికి చిన్న ట్రిక్ కూడా ప్లే చేస్తోంది. అలాంటి సినిమాలకు పెద్ద దర్శకులు ఉండాలనీ... ఒకవేళ పెద్ద హీరోలైతే కొత్త దర్శకులైనా పర్వాలేదనీ ఈ ముద్దుగుమ్మ కండిషన్ పెడుతోందని కోలీవుడ్ టాక్. తాజాగా 'బెంగళూర్ డేస్' తెలుగు, తమిళ రీమేక్ లో కూడా శ్రీదివ్య నటిస్తున్నట్టు సమాచారం. 

Share this Story:

Follow Webdunia telugu