Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

''కాంచన 2'' ప్రమోషన్ సాంగ్.. లారెన్స్ సరసన తాప్సీతోపాటు నిత్యా మీనన్‌ కూడా...!

''కాంచన 2'' ప్రమోషన్ సాంగ్.. లారెన్స్ సరసన తాప్సీతోపాటు నిత్యా మీనన్‌ కూడా...!
, బుధవారం, 29 ఏప్రియల్ 2015 (12:07 IST)
సినీ పరిశ్రమలో ప్రస్తుతం పోటీని తట్టుకునేందుకు సినిమా షూటింగ్ ప్రారంభం నుంచి అన్ని అంశాలలోను జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అందులో భాగంగా ఇటీవల చిత్ర ప్రమోషన్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. అభిమానులను ఆకట్టుకునేందుకు సినిమాతో సంబంధం లేకుండా ప్రత్యేక ప్రమోషనల్ సాంగ్‌ను విడుదల చేస్తున్నారు. ఆ కోవలో తాజాగా లారెన్స్ హీరోగా నటిస్తూ లారెన్స్ దర్శకత్వం వహించిన ''కాంచన 2'' చిత్రానికి స్పెషల్ ప్రమోషనల్ సాంగ్‌ను షూట్ చేస్తున్నారు.
 
ఈ చిత్రం ఇప్పటికే తమిళంలో రిలీజై మంచి ఆదరణ తెచ్చుకుంది. త్వరలో తెలుగులో ''గంగ'' విడుదల చేస్తున్నారు. ఇందుకోసమే ఈ ప్రమోషనల్ సాంగును లారెన్స్, నిత్యా మీనన్, తాప్సీలపై షూట్ చేశారు. త్వరలో దీనిని విడుదల చేస్తారట. సినిమాతో సంబంధం లేకుండా తీసే ఈ సాంగ్‌లో తాప్సీ, నిత్యా మీనన్‌లో ప్రత్యేకంగా ఆకట్టుకుంటారని తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu