Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నిత్యామీనన్‌కు భలే ఛాన్స్.. సౌత్ 'క్వీన్'గా ఎంపిక..!

నిత్యామీనన్‌కు భలే ఛాన్స్..  సౌత్ 'క్వీన్'గా ఎంపిక..!
, శుక్రవారం, 27 ఫిబ్రవరి 2015 (15:40 IST)
బాలీవుడ్‌లో కంగనా రనౌత్ ప్రధన పాత్రలో నటించిన సినిమా 'క్వీన్'. హిందీలో ఆ సినిమా ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా  చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ అంటూ నాలుగు దక్షిణాది భాషల్లో రిమేక్ హక్కులని తమిళ హీరో ప్రశాంత్ తండ్రి త్యాగరాజన్ సొంతం చేసుకున్నాడు. 
 
అయితే 'క్వీన్' సినిమా రిమేక్ హక్కులని దక్కించుకున్న అయన ప్రముఖ హీరోయిన్‌ని నటింపచేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రీమేక్ చిత్రంలో తొలుత త్రిషను నటింప చేయాలనుకున్నారట. అయితే ఆమె వలన సినిమాకు అంత లాభలం ఉండబోదని సన్నిహితులు తెలపడంతో వద్దనుకున్నారట.
 
ఆ తర్వాత సమంత, శృతి హసన్, తమన్నా పేర్లును కూడా పరిశీలించారట. అయితే వీరెవ్వరూ ఈ సినిమాకి ఖరారు కాలేదు. తాజా సమాచారం ప్రకారం 'క్వీన్' సౌత్ రీమేక్ కోసం నిత్యామీనన్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్టు కోలీవుడ్ టాక్. ఎందుకంటే నిత్యామీనన్ అయితే అటు తెలుగు, తమిళం, మలయాళ అంటూ పలు భాషల్లో క్రేజ్ ఉన్న నటి అని త్యాగరాజన్ భావించారట. త్వరలో ఈ సినిమా వెల్లనున్నట్టు సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu