Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టాలీవుడ్ వైపు సిద్ధార్థ్ చూపు.. సక్సెస్ కోసం వెంపర్లు..!

టాలీవుడ్ వైపు సిద్ధార్థ్ చూపు.. సక్సెస్ కోసం వెంపర్లు..!
, గురువారం, 16 ఏప్రియల్ 2015 (11:21 IST)
పక్కింటి అబ్బాయిని తలపించే హీరో సిద్దార్థ్. సహజమైన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న సిద్ధార్థ్ బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రాలు ఘన విజయం సాధించినప్పటికీ ఆ తర్వాత ఆయనకు ఆశించిన స్థాయిలో సక్సెస్ కొట్టేలేకపోయాడు. అయితే ఆ సమయంలోనే ఆయనకి తమిళ్ సినిమాల్లో హిట్లు పడ్డాయి. 
 
దీంతో చెన్నై‌లో సెటిల్ అయిన సిద్ధార్థ్ అక్కడ వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ, నిలదొక్కుకో గలిగాడు. అయితే మనసు మాత్రం తెలుగు సినిమాల వైపు లాగుతూనే ఉంటుందని ఆయన అంటున్నాడు. దీంతో మళ్లీ ఆయన చూపి టాలీవుడ్‌పై పడింది. ఈ సారి ఇక్కడ తప్పకుండా సక్సెస్ చూస్తాననీ, ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నానని చెబుతున్నాడు. 
 
అందులో భాగంగానే తెలుగు ప్రేక్షకులకి నచ్చే రీతిలో, కొత్తదనం గల కథాంశాలను సిద్ధం చేసుకుంటున్నానని సిద్ధార్థ్ తెలుపుతున్నాడు. సిద్ధూ ప్రయత్నం ఫలించాలని ఆశిద్దాం.

Share this Story:

Follow Webdunia telugu