Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'బెంగుళూర్ డేస్'లో సమంతతో నటించేందుకు సిద్దార్థ్ నో... బ్రేకప్పే కారణమా...!

'బెంగుళూర్ డేస్'లో సమంతతో నటించేందుకు సిద్దార్థ్ నో... బ్రేకప్పే కారణమా...!
, ఆదివారం, 1 ఫిబ్రవరి 2015 (13:02 IST)
దక్షిణాది చిత్ర సీమలో హాట్ జంటగా హల్‌చల్ చేస్తూ వచ్చిన సిద్దార్థ్, సమంతల ప్రేమ బ్రేకప్ అయిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా తెలుగు, తమిళం భాషల్లో రీమేక్ కాబోతున్న చిత్రం బెంగుళూర్ డేస్. ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా సిద్దార్థ్, సమంతలు ఎంపికయ్యారు. అయితే ప్రస్తుతం వీరిద్దరూ ఈ సినిమాలో నటించడానికి సిద్ధంగా లేరట. ఇందుకు బ్రేక్ అప్ కావడమే కారణం అని అంటున్నారు.
 
ఈ చిత్రంలో సిద్దార్థ్‌తో నటించేందుకు తొలుత సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే అప్పుడు సిద్దార్థ్ ఎటువంటి కామెంట్ చేయలేదు. దీంతో వీరిద్దరు మళ్లీ తెరపై కనిపిస్తారని అందరూ ఊహించారు. ఈ స్థితిలో తాజాగా ఆన్ స్క్రీన్ పై సమంతతో నటించడానికి ఇష్టం లేదని, కనుకనే ఆమెతో నటించనని సిద్దార్థ్ చెప్పినట్లు సమాచారం. 
 
అయితే చిత్ర దర్శక నిర్మాతలు మాత్రం బెంగుళూర్ డేస్‌కు సిద్దార్థ్, సమంతలనే నటింపచేయాలని చూస్తున్నారు. అందుకోసం వారిద్దరితో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ఇక ఈ జంట వెండితెరపై వెలుగుతుందో లేదో వేచి చూడాల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu