Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సిస్టర్ అక్షర కోసం పాటపాడనున్న శృతిహాసన్!

సిస్టర్ అక్షర కోసం పాటపాడనున్న శృతిహాసన్!
, మంగళవారం, 21 అక్టోబరు 2014 (11:27 IST)
తన సోదరి అక్షర హాసన్ సినిమా కోసం అందాల ముద్దుగుమ్మ శృతిహాసన్ ఓ పాట పాడనుంది. అంతకుముందు 'తేవర్'లో సోనాక్షి సిన్హాకు పాడిన శృతిహాసన్‌కు ఇది రెండో హిందీ పాట కావడం గమనార్హం. 
 
శృతిహాసన్ సంగీతం నేర్చుకున్న క్లాసికల్ సింగర్. అందుకే కథానాయికగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ, రిక్వెస్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ కాదనకుండా బాలీవుడ్‌లో పాటలు కూడా పాడుతోంది. తాజాగా సోదరి అక్షర హసన్ కోసం ఓ పాట పాడబోతోంది. 
 
దర్శకుడు ఆర్.బాల్కీ రూపొందిస్తున్న 'షమితాబ్' చిత్రంలో ఈ పాట పాడనుంది. మరో ప్రత్యేకతేమిటంటే, ఇళయరాజా మ్యూజిక్ డైరక్షన్‌‍లో శృతి పాడనుండటమేని బాలీవుడ్ వర్గాల సమాచారం. 

Share this Story:

Follow Webdunia telugu