Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రియకు మనం కలిసొచ్చింది: టాలీవుడ్, కోలీవుడ్ ఆఫర్లతో బిజీ బిజీ!!

శ్రియకు మనం కలిసొచ్చింది: టాలీవుడ్, కోలీవుడ్ ఆఫర్లతో బిజీ బిజీ!!
, గురువారం, 24 జులై 2014 (15:15 IST)
లైమ్‌‌లైట్ బ్యూటీ శ్రియ మళ్లీ బిజీ బిజీ కానుంది. మనం సినిమా ద్వారా రెండేళ్ల లాంగ్ గ్యాప్‌‌కు తర్వాత టాలీవుడ్‌లో నటించిన శ్రియ.. తాజాగా తమిళంలోనూ కొత్త సినిమాల కోసం కాల్షీట్స్ ఇచ్చేసిందట. మనం సినిమాలో నటించడం ద్వారా మళ్లీ శ్రియకు టాలీవుడ్ ఆఫర్లు వస్తున్నాయి. తమిళంలోనూ ఇదేవిధంగా అవకాశాలొస్తున్నాయి. 
 
2012, 2013 సంవత్సరాల్లో సినీ ఛాన్సులు లేకుండా ఖాళీగా ఉండిన శ్రియ.. ఒక్కసారిగా తమిళం, తెలుగు సినిమాల్లో అవకాశాలు రావడంతో బిజీ బిజీ అయిపోయిందట. ఒకప్పుడు దక్షిణాది సినీ రంగాన్ని ఓ ఊపు ఊపిన శ్రియ.. మధ్యలో సినీ ఛాన్సులకు దూరమైంది. 
 
తమిళంలో సూపర్ స్టార్ శివాజీ సరసన నటించినా, తెలుగులో పవిత్రలో వేశ్యగా శ్రియ హాట్ లుక్ ఇచ్చినా.. ఫలితం లేకపోయింది. కానీ మనం సినిమా శ్రియ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అయ్యింది. దీంతో శ్రియకు అవకాశాలు మెండుగా వస్తున్నాయని సినీ వర్గాల్లో టాక్.

Share this Story:

Follow Webdunia telugu