Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారీ రేటుకు 'లయన్'...! శాటిలైట్ రైట్స్ విక్రయం..!

భారీ రేటుకు 'లయన్'...! శాటిలైట్ రైట్స్ విక్రయం..!
, ఆదివారం, 1 మార్చి 2015 (14:41 IST)
హీరో బాలకృష్ణ తాజాగా నటిస్తున్న సినిమా లయన్ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. అంతకుముందు బాలకృష్ణ నటించిన సూపర్ హిట్ సాధించిన లెజెండ్ సినిమా విడుదలయిన మార్చి 28 తేదినే లయన్‌ను కూడా విడుదల చేయడాన్ని సన్నాహాలు చేస్తున్నారు. 
 
తాజా సమాచారం ఏమిటంటే సత్యదేవ దర్శకత్వంలో రమణారావు నిర్మిస్తున్న ఈ సినిమాకి శాటిలైట్ రైట్స్‌ని జెమిని టీవీ దాదాపు 6 కోట్ల రూపాయలకి సొంతం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. లయన్ శాటిలైట్ రైట్స్ కోసం మూడు చానల్స్ పోటీ పడి....గతంలో లెజెండ్ సినిమాని దక్కించుకున్న జెమిని టీవీనే భారీ ధర చెల్లించి లయన్ సినిమా రైట్స్ ని కూడా పొందినట్టు టాక్. కాగా ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన త్రిష, రాధిక ఆప్టే హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu