Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

‘రోబో 2′లో షారుక్ - రజనీకాంత్.. అక్కడ హీరో.. ఇక్కడ విలన్..

‘రోబో 2′లో షారుక్ - రజనీకాంత్.. అక్కడ హీరో.. ఇక్కడ విలన్..
, మంగళవారం, 26 మే 2015 (18:28 IST)
బ్రహ్మాండాల రూపకర్త శంకర్ - దక్షిణాది సూపర్ స్టార్ రజనికాంత్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం రోబో. గత 2010లో విడుదలైన రోబో సూపర్ హిట్టు కొట్టి, బాక్సాఫీసు వద్ద వసూళ్ళ వర్షం కురిపించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ చిత్రం సీక్వెల్‌ను తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. త్వరలో ఈ సినిమా లాంచ్ అవ్వబోతుంది. ఇక రోజు రోజుకి ఈ సినిమా గురించి కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి.
 
తాజాగా అందిన సమాచారం ప్రకారం బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ఈ సినిమాలో విలన్‌గా నటించబోతున్నారని చెబుతున్నారు. తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కే ఈ సినిమాలో హిందీలో హీరోగా, తమిళంలో విలన్‌గా షారూఖ్ నటిస్తారని సమాచారం. అలాగే రజనీకాంత్ కూడా తమిళంలో హీరోగా, హిందీలో విలన్‌గా నటిస్తారట. ఈ రకంగా పాత్రలను మార్చడం కలిసివస్తుందని శంకర్ భావిస్తున్నారట. అయితే ఇంకా హీరోయిన్ ఎంపిక జరగలేదని సమాచారం. 

Share this Story:

Follow Webdunia telugu