Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మానవ మృగం 'ఐ'కి పోటీగా 'టెంపర్' జూ.ఎన్టీఆర్ చొక్కా లేకుండా...

మానవ మృగం 'ఐ'కి పోటీగా 'టెంపర్' జూ.ఎన్టీఆర్ చొక్కా లేకుండా...
, బుధవారం, 26 నవంబరు 2014 (15:44 IST)
‘లింగా’ డిసెంబరులో విడుదల కాబోతోంది. ఆ తర్వాత సంక్రాంతికి శంకర్ డైరెక్షన్లో తెరకెక్కిన 'ఐ' సినిమా వస్తున్నట్లు సమాచారం. ఐతే పండుగ బరిలో గుణశేఖర్ చిత్రం రుద్రమదేవితోపాటు బండ్ల గణేష్, జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నిర్మిస్తున్న టెంపర్ చిత్రాలు కూడా వస్తున్నట్లు సమాచారం. దీంతో సంక్రాంతి పండుగనాడు మూడు భారీ చిత్రాలు ఢీకొనబోతున్నట్లు తెలుస్తోంది. ఐతే అన్ని చిత్రాలు అప్పుడే విడుదలయితే ఒకటి మినహా మిగిలిన రెండింటికీ భారీ దెబ్బ తగులుతుంది. ఈ నేపథ్యంలో ఈ మూడు చిత్రాలకు సంబంధించిన నిర్మాతలు ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. 
 
ఇకపోతే 'టెంపర్' చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ చొక్కా లేకుండా బాడీ చూపిస్తూ ఉన్న ఫోటో ఒకటి లీక్ అయింది. వ్యవహారం చూస్తుంటే ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ తన టెంపర్ ఏమిటో చూపించేట్లే ఉన్నాడు. ఇంకోవైపు ఐ చిత్రంలో విక్రమ్ లుక్స్ ఇప్పటికే సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అలాగే అనుష్క నటించిన రుద్రమదేవి గురించి వేరే చెప్పక్కర్లేదు. ఈ చిత్రంలో గోన గన్నారెడ్డిగా బన్నీ నటిస్తుండగా, మరో ప్రత్యేక పాత్రలో తమన్నా కూడా నటిస్తోంది. ఇలా అన్ని అంశాలతో సంక్రాంతి బరిలోకి రాబోతున్న చిత్రాల్లో గెలిచే పందెం కోడి ఏదనే చర్చ నడుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu