Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'బాయ్‌హుడ్' రీమేక్‌తో షారుఖ్ కొడుకులు తెరంగేట్రం..!

'బాయ్‌హుడ్' రీమేక్‌తో షారుఖ్ కొడుకులు తెరంగేట్రం..!
, బుధవారం, 1 ఏప్రియల్ 2015 (18:22 IST)
వెండితెరపై వెలిగే స్టార్స్ తమ కుమారులు, కుమార్తెలను సినీ రంగానికి తీసుకురావడం మామూలే. తాజాగా బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ తన కుమారులు ఆర్యన్ ఖాన్‌, అభిరామ్‌లను సినీరంగానికి పరిచయం చేయనున్నారు. 
 
హాలీవుడ్లో సూపర్ డూపర్ హిట్టయి ఆస్కార్ అవార్డు పొందిన చిత్రం 'బాయ్హుడ్'ను తిరిగి బాలీవుడ్ లో నిర్మించడం ద్వారా ఆర్యన్, అభిరామ్‌లను ప్రేక్షకుల దగ్గరికి చేర్చాలని షారుఖ్ నిర్ణయించారు. ఆస్కార్ అవార్డు పొందిన 'బాయ్హుడ్'ను తన పెద్ద కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను హీరోగా పెట్టి తీయాలని షారుఖ్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. 
 
ఈ చిత్ర నిర్మాతలను కూడా ఆయన సంప్రదించారని, నిర్మాణ హక్కులను తమకు ఇవ్వాలని కోరారని తెలిసింది. అయితే, బాయ్‌హుడ్ చిత్రాన్ని మొత్తం 12 ఏళ్లపాటు చిత్రీకరించారు. ఇందులో ఎల్లర్ కాల్ట్రేన్ నటించాడు. ఈ పన్నెండేళ్లలో వచ్చిన మార్పుల ఆధారంగా చిత్రాన్నితీశారు. 
 
అయితే, షారుఖ్ రిమేక్ చేయనున్న ఈ చిత్రంలో బాల్యంనాటి సన్నివేశాల కోసం తన చిన్న కుమారుడు అభిరామ్తో చిత్రీకరించేందుకు నిర్ణయించినట్టు సమాచారం. తద్వారా ఇద్దరు కుమారులు సినీ ప్రేక్షకులకు పరిచయం చేసినట్లవుతుందని షారుఖ్ అభిప్రాయం.

Share this Story:

Follow Webdunia telugu