Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'సీత'లోని అంతర్ముఖం... సీతగా మధుశాలిని

'సీత'లోని అంతర్ముఖం... సీతగా మధుశాలిని
, బుధవారం, 24 సెప్టెంబరు 2014 (19:13 IST)
''సీత లోని అంతర్ముఖాన్ని ఆవిష్కరించే ప్రయత్నమే 'సీతావలోకనం' చిత్రమని దర్శకుడు మాదల వేణు తెలియజేస్తున్నారు. మధుశాలిని, ప్రగతి, మీనాకుమారి ప్రధాన తారాగణంగా రూపొందుతోన్న ఈ చిత్రం ట్రైలర్‌ ఇటీవలే విడుదలైంది. విజయలక్ష్మి ప్రొడక్షన్స్‌ బేనర్‌పై అడకా వెంకటేష్‌ యాదవ్‌ నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథి కె. విశ్వనాథ్‌ ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ఇది ఒక మంచి ప్రయత్నమనీ, దర్శకుడు తక్కువ మాట్లాడి ఎక్కువ పనిచేసేవాడనీ, మధుశాలిని సీతగా బాగుందని' తెలిపారు.
 
మరో అతిథి కొండవీటి జ్యోతిర్మయి మాట్లాడుతూ... దర్శకుడు సీత పాత్ర గురించి నాతో చాలా చర్చించారు. సీత గురించి సినిమా తీయడమే ఒక ధైర్యమని చెప్పాను. అందుకు ధైర్యంగానే దర్శకుడు తీశాడని తెలిపారు. 
 
తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. అంజలిదేవి తర్వాత నయనతార సీతాదేవిగా అందరినీ అలరించింది. ఇప్పుడు మధుశాలిని కూడా సీత పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. మంచి ప్రయత్నమిది. విజయవంతం కావాలని ఆశిస్తున్నానని' అన్నారు.
 
నిర్మాత అడకా వెంకటేష్‌ తెలుపుతూ.. నిర్మాతగా తొలి ప్రయత్నమిది. వేణు చెప్పిన కథ బాగా నచ్చి నిర్మించడానికి ముందుకు వచ్చాను. అందరినీ అలరిస్తుందనే నమ్ముతున్నానని పేర్కొన్నారు. చిత్ర దర్శకుడు మాట్లాడుతూ... జ్యోతిర్మయిగారు ఎంతో స్పూర్తినిచ్చారు. మధుశాలినిలో కూచిపూడి బ్యాలె చేద్దామని అనుకున్నాం. అలా చివరికి సినిమాగా ప్రారంభించామని అన్నారు. మధుశాలిని మాట్లాడుతూ.. దర్శకుడు నేను స్నేహితులం. కూచిపూడి బాల చేద్దామని సినిమా ప్రారంభించారు. ఆఖరికి సీతగా చూపించారు. ఇలాంటి అవకాశం రావడం ఆనందంగా వుందని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఘంటసాల విశ్వనాథ్‌, కెమెరా: ఎస్‌.వి. విశ్వేశ్వర్‌, ఎడిటర్‌: కళ్యాణ్‌.

Share this Story:

Follow Webdunia telugu